Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. రూ.1.14 లక్షల ఫోన్ ఇప్పుడు రూ.94,999కే.. ఏకంగా రూ.20 వేల తగ్గింపు
Samsung Galaxy S25 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ రూ.20వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది.. రూ.94,999కే ఫోన్ కొనుగోలు చేయొచ్చు.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 9, 2026 / 07:06 PM IST
Samsung Galaxy S25 Ultra
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అదిరిపోయే ఆఫర్..
- తక్కువ ధరకే శాంసంగ్ ప్రీమియం ఫోన్.. అమెజాన్ డీల్
- శాంసంగ్ అల్ట్రాపై భారీ ఆఫర్.. రూ.20 వేలకు పైగా తగ్గింపు
Samsung Galaxy S25 Ultra : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన అవకాశం. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది..
ఏకంగా రూ.20 వేలకు పైగా తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కలిపితే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇంతకీ ఈ శాంసంగ్ అమెజాన్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..
అమెజాన్‌లో S25 అల్ట్రా ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా అసలు ధర రూ.1,14,999 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.94,999కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.20వేలు తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ప్రైమ్ సభ్యులకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులు కానివారికి ఈ బెనిఫిట్ 3 శాతం మాత్రమే.. ఇక నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది.
నెలకు రూ.3,340 నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.37,600 వరకు వాల్యూ పొందవచ్చు. అయితే, పాత ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ వాల్యూ మారుతుంది..
ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. గరిష్ఠంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. 6.9 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి..
కెమెరాల విషయానికి వస్తే..
200MP మెయిన్ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియోలపై ఇంట్రెస్ట్ ఉంటే ఈ కెమెరా సెటప్ సూపర్ ఉంటుంది. ఇక, ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొనాలనుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, ఆఫర్ ధరలు, బ్యాంక్ బెనిఫిట్స్ మారే అవకాశం ఉంది.
