Samsung Galaxy S26 FE : శాంసంగ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఈ గెలాక్సీ S26 FE ధర ఎంతో తెలిసిందోచ్.. ఫస్ట్ సేల్ డేట్ ఇదే..!

Samsung Galaxy S26 FE : భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ S26 FE ఫోన్ లాంచ్ కాగా ధర మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర భారత మార్కెట్లో ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం..

Samsung Galaxy S26 FE

  • భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 FE ధర ఎంతంటే?
  • ప్రపంచవ్యాప్తంగా రూ. 89,900 ధర రేంజ్‌లో లాంచ్
  • ఈ నెల 18న భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రారంభం

Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ గెలాక్సీ S26 FE ఫోన్ ఎప్పుడో లాంచ్ అయింది. దాదాపు రెండు వారాల తర్వాత కంపెనీ భారత మార్కెట్లో ధర ఎంతో ప్రకటించింది.

ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 799 యూరోల ప్రారంభ ధరతో సుమారుగా రూ. 89,900కు లాంచ్ అయింది. గత ఏడాది ఆరంభంలో వచ్చిన గెలాక్సీ S26 సిరీస్‌లో అత్యంత సరసమైన ఫోన్ ఇదే..

భారీత్‌లో ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ సెప్టెంబర్ 18న భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ప్రస్తుతం, ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ (Samsung Galaxy S26 FE) వేరియంట్‌లో లభిస్తోంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో రూ.79,999 ధరకు లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB, 8GB ర్యామ్ + 512GB అందిస్తుంది.

Read Also : Best Camera Smartphones : ఫోటోలు, వీడియోలకు ఫుల్ పర్ఫెక్ట్.. ఈ నెలలో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ ఫోన్ బ్లూబెర్రీ, గ్రాఫైట్ పిస్తాషియో అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7వేలు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.8వేల వరకు బోనస్ లభిస్తుంది. 30 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6.7-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్ ఉన్నాయి.

అంతేకాదు.. ఇన్-హౌస్ ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ ఉంది. ఈ ప్రాసెసర్ 3nm టెక్నాలజీపై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. 45W వైర్డ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే పవర్‌ఫుల్ 4,900mAh బ్యాటరీ కూడా ఉంది.

ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ OIS కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ 8MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత OneUI 9పై రన్ అవుతుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో వై-ఫై, బ్లూటూత్ NFC వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.