Samsung Galaxy S26 FE : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. కొత్త గెలాక్సీ ఫోన్‌పై భారీ ఆఫర్.. ఇలా కొంటే రూ.7 వేలు మిగులుతాయి!

Samsung Galaxy S26 FE : శాంసంగ్ గెలాక్సీ S26 FE ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ మొదలైంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4900mAh బ్యాటరీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 7వేల తగ్గింపుతో పొందవచ్చు. పూర్తి సేల్ వివరాలివే..

  • Published on- September 21, 2026 / 07:40 PM IST

Samsung Galaxy S26 FE

  • 6.7-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే
  • బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • 4900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు

Samsung Galaxy S26 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. భారత మార్కెట్లో ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ లాంచ్ కాగా ఇప్పుడు సేల్ ప్రారంభమైంది.
గెలాక్సీ S26 సిరీస్‌లో సరికొత్తగా చేరిన ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4900mAh బ్యాటరీతో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ ధర, ఆఫర్లు, సేల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ ఫస్ట్ సేల్ (Samsung Galaxy S26 FE) ప్రారంభమైంది. గెలాక్సీ S26 ఎఫ్ఈ కేవలం 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 79,999కే కొనేసుకోవచ్చు. అలాగే, పిస్తాషియో, బ్లూబెర్రీ గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో కూడా సొంతం చేసుకోవచ్చు. ప్రారంభ ఆఫర్లలో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 8వేల వరకు బోనస్ లభిస్తుంది.

ఎంపిక చేసిన NBFC పార్టనర్ల ద్వారా 30 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, రూ. 3వేలు అదనపు అప్‌గ్రేడ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, వివిధ బ్యాంకుల కార్డులపై రూ. 7వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 12 నెలల నో-కాస్ట్ బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. శాంసంగ్ ఇ-స్టోర్ నుంచి కొనుగోలు చేస్తే 18 నెలల బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఎంచుకోవచ్చు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈలో 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, 6.7-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. గెలాక్సీ S26 ఎఫ్ఈ ఎక్సినోస్ 2500 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9పై రన్ అవుతుంది.

Read Also : Google Pixel 11 Pro XL : రూ.10 వేలు తగ్గుతుందంటే ఎవరైనా కొంటారు.. పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్‌పై భారీ ఆఫర్!

ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ 4900mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చారు. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
శాంసంగ్ గెలాక్సీ S26 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో అల్ట్రావైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ జెమిని ఓమ్ని (Gemini Omni)కి సపోర్ట్ చేస్తుంది. తద్వారా గ్యాలరీలోని ఫోటోలు వీడియోలతో ఎడిట్ చేయవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ 5.4, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.