Samsung Galaxy S26 : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చేస్తోంది.. ఈసారి 3 ఫోన్లు.. లాంచ్ డేట్, ధరపై భారీ అంచనాలు!

Samsung Galaxy S26 Launch : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, గెలాక్సీ S26, S26 ప్లస్, S26 అల్ట్రాతో సహా ఫిబ్రవరి 25 2026న లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Samsung Galaxy S26 Launch

  • శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ తేదీ ఇదేనా?
  • ఫిబ్రవరి 25నే శాంసంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్
  • ట్రిపుల్ రియర్ కెమెరా , 50MP ప్రైమరీ స్నాపర్, 12MP ఫ్రంట్ కెమెరా
  • గెలాక్సీ S26 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌

Samsung Galaxy S26 Launch : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రాబోతుంది. ఈసారి S26 సిరీస్ మొత్తం 3 ఫోన్లు రాబోతున్నాయి. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా అనే 3 కొత్త ఫోన్లు ఉన్నాయి.

లాంచ్ సమయం కూడా రెండు వారాల కన్నా తక్కువ సమయం ఉంది. ఇందులో బేస్ వేరియంట్ ధర, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ శాంసంగ్ S26 సిరీస్ ధర, లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు వంటి పూర్తి ఫీచర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read Also : Apple iPhone 18 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 18 వచ్చేస్తోందోచ్, లాంచ్ డేట్, కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

శాంసంగ్ గెలాక్సీ S26 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా సన్నని ఛాసిస్‌తో మెటల్ ఫ్రేమ్‌ ఉండొచ్చు. ఇతర డిజైన్ మార్పులు పెద్దగా లేన్నట్టు కనిపిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ 4 విభిన్న కలర్ ఆప్షన్లలో రానుంది. అందులో బ్లూ, వైట్, బ్లాక్, లైట్ ఆరెంజ్ వంటి కలర్ వేరియంట్లు ఉండనున్నాయి.

ఆప్టిక్స్ విషయానికి వస్తే. శాంసంగ్ గెలాక్సీ S26లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50MP ప్రైమరీ స్నాపర్, 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో స్నాపర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ స్నాపర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రానుంది. ఇందులో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉండవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ఎక్కువగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వన్ యూఐ 8.5 స్కిన్‌తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, దాదాపు 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల QHD ఓఎల్ఈడీ ప్యానెల్‌ ఉండనుంది. బేస్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4300mAh బ్యాటరీతో రావొచ్చు.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 లాంచ్ తేదీ, ధర ఎంతంటే? :
మొత్తం మూడు ఫోన్లతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫిబ్రవరి 25, 2026న జరిగే గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ధర విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ ధర దాదాపు రూ.84,990 నుంచి ఉండే అవకాశం ఉంది.