Apple iPhone 18 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 18 వచ్చేస్తోందోచ్, లాంచ్ డేట్, కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Apple iPhone 18 Launch : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ షాకిచ్చింది. ఐఫోన్ 18 లాంచ్ తేదీ, ధర, డిజైన్, స్పెషిఫికేషన్లు ద్వారా అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. బేస్ వేరియంట్ ఐఫోన్ 17 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.
Apple iPhone 18 Launch
- ఆపిల్ ఐఫోన్ 18 లాంచ్ డేట్ ఎప్పుడంటే?
- ఐఫోన్ 17కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రాబోతుంది
- ఐఫోన్ 18లో కూడా భారీగా మార్పులు ఉండొచ్చు
- iOS27లో రన్ అయ్యే అవకాశం
- ఐఫోన్ 18 రూ. 85,900 ధర ఉండొచ్చు
Apple iPhone 18 Launch : ఆపిల్ లవర్స్ కోసం సరికొత్త ఐఫోన్ రాబోతుంది. కొత్త ఐఫోన్ 18 మోడల్ లాంచ్ చేసేందుకు టెక్ దిగ్గజం రెడీ అవుతోంది. లీక్‌లను పరిశీలిస్తే.. కొత్త ఐఫోన్ మోడళ్లలో భారీ మార్పులు ఉండొచ్చు. ఈ ఏడాదిలో రావాల్సిన బేస్ వేరియంట్ లాంచ్ తేదీని కుపెర్టినో ఆధారిత దిగ్గజం మార్చేసింది.
ఇప్పటివరకు చూసిన అన్ని బేస్ వేరియంట్లలో ఐఫోన్ 17 అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ ఐఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ ఐఫోన్ 18 తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాల చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ఐఫోన్ 18కి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఐఫోన్ 18 కెమెరా , డిజైన్, స్పెసిఫికేషన్లు :

Apple iPhone 18
ఆపిల్ ఐఫోన్ 18 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ సెన్సార్ ఉండొచ్చు.
డిజైన్ విషయానికి వస్తే.. ఆపిల్ ఇప్పటికే ఐఫోన్ 17లో మార్పులు చేసింది. ఐఫోన్ 18లో గతంలో మాదిరిగానే ఎలిమెంట్స్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. కొన్ని కొత్త కలర్ ఆప్షన్లు ఉంటాయి.పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
స్పెషిఫికేషన్ల విషయానికొస్తే..
ఐఫోన్ 18 ఆపిల్ A20 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్ 6.3-అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లే, కనీసం 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. iOS27లో రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో అనేక ఫీచర్లతో ఐఫోన్ 18 లాంచ్ కానుంది.
భారత్‌లో ఐఫోన్ 18 ధర, లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 18 రూ. 85,900 ధరకు లాంచ్ కానుంది. లాంచ్ తేదీ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో లాంచ్ అవకాశం లేదని పుకార్లు ఉన్నాయి. వాస్తవానికి, ఐఫోన్ 18 సిరీస్ ఫిబ్రవరి 26, 2027 నాటికి మార్కెట్లోకి రావొచ్చు.
