Samsung Galaxy S27 Ultra : శాంసంగ్ కొత్త S27 అల్ట్రా ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Samsung Galaxy S27 Ultra : శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రాకు సంబంధించిన కీలక లీకులు వెలుగులోకి వచ్చాయి. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 65W ఛార్జింగ్, 2nm చిప్ వంటి ఫీచర్లపై వివరాలు ఇలా ఉన్నాయి..

Samsung Galaxy S27 Ultra

  • 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. లీకైన స్పెషిఫికేషన్లు ఇవే
  • 65W ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా
  • ఫిబ్రవరి 2027లో ఎంట్రీ? ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే

Samsung Galaxy S27 Ultra : సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి నుంచి 2027లో శాంసంగ్ గెలాక్సీ ఎస్27 సిరీస్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో గెలాక్సీ ఎస్27, గెలాక్సీ ఎస్27 ప్లస్, గెలాక్సీ ఎస్27 అల్ట్రా మోడల్స్ ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌కు సంబంధించి ఇప్పటికే పలు లీకులు, రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

లీకైన సమాచారం ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రాలో OISతో 200MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్, 10MP టెలిఫోటో కెమెరాలు ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది.

Read Also : Vivo X300 FE : సూపర్ డిస్కౌంట్.. రూ.1.09 లక్షల వివో ఫోన్ జస్ట్ రూ.89,999కే.. బ్యాంకు ఆఫర్లతో ఇంకా తగ్గింపు!

డిస్‌ప్లే విషయానికి వస్తే..
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల అమోల్డ్ 2ఎక్స్ స్క్రీన్ ఉండవచ్చని సమాచారం. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్ కూడా అందిస్తోంది.

చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ ప్రకారం.. ఈ చిప్ 2nm ప్రాసెస్‌పై వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ ఫోన్ 7.9mm మందంతో ఎస్ పెన్ సపోర్ట్‌తో రావచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండవచ్చని సమాచారం..

లాంచ్ టైమ్, ధర అంచనాలివే :
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రాను శాంసంగ్ 2027 ఫిబ్రవరి ప్రారంభంలో భారత మార్కెట్‌లో లాంచ్ చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,41,999 నుంచి రూ.1,46,999 మధ్య ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.