Samsung Galaxy Z Flip 4 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 56,000 డిస్కౌంట్.. ఇంత తక్కువలో మళ్లీ రాదు!
Samsung Galaxy Z Flip 4 : కొత్త శాంసంగ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ఈ మడతబెట్టే ఫోన్‌పై ఏకంగా రూ. 56వేలు తగ్గింపుతో అందిస్తోంది. ఈ క్రేజీ డీల్ అసలు వదులుకోవద్దు.
- Sreehari A
- Published on- April 16, 2026 / 07:26 PM IST
Samsung Galaxy Z Flip 4
- శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 లో 6.7-అంగుళాల అమోల్డ్ 2X డిస్‌ప్లే
- ఈ మడతబెట్టే ఫోన్ 3,700mAh బ్యాటరీ, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు
- 12MP మెయిన్ కెమెరా, 1.9-అంగుళాల సూపర్ అమోల్డ్ ఔటర్ డిస్‌ప్లే
Samsung Galaxy Z Flip 4 : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీరు శాంసంగ్ ఫ్లిప్ మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఈ అద్భుతమైన అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు. ఇప్పటికే చాలా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి.
అయితే, అమెజాన్, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. డీల్స్ ధర, ఫీచర్ల వరకు, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్ 8GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,370గా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు 2022లో రూ. 94,999 ధరకు లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసే పేమెంట్లపై 5శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 36,250 ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 56వేలు తక్కువకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్ 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ప్రైమరీ ఫుల్-HD+ డైనమిక్ అమోల్డ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ ఫోన్‌లో 260×512 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.9-అంగుళాల సూపర్ అమోల్డ్ ఔటర్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 3,700mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/1.8 అపర్చర్, OIS సపోర్ట్‌తో 12MP వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 10MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
