Samsung Galaxy Z Flip7 FE 5G : ఏంది భయ్యా డిస్కౌంట్.. శాంసంగ్ మడతబెట్టే ఫోన్ మరి ఇంత తక్కువా.. ఈ డీల్ మళ్లీ రాదు..!
Samsung Galaxy Z Flip7 FE 5G : కొత్త శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా రూ. 10వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- June 29, 2026 / 05:58 PM IST
Samsung Galaxy Z Flip7 FE 5G
- 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే
- 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 4,000mAh బ్యాటరీ
- 8GB ర్యామ్, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్
Samsung Galaxy Z Flip7 FE 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రిలయన్స్ డిజిటల్‌లో అతి చౌకైన ధరకే లభ్యమవుతోంది. జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీ డీల్స్, ధర, స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం..
ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ 5జీలో 8GB/128GB స్టోరేజ్ వేరియంట్, రిలయన్స్ డిజిటల్‌లో రూ. 89,999 ధరకు లిస్ట్ అయింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.10వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఇతర బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. దాంతో అసలు ధర నుంచి రూ.79,999కు లభిస్తుంది. అంటే.. ప్రారంభ ధర కన్నా రూ. 10వేలు చౌకగా లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ప్రైమరీ డిస్‌ప్లేతో వస్తుంది. 1-120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ .. :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీతో వస్తుంది. 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP48 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 6.9mm స్క్రీన్, అదే ఫోల్డ్ చేస్తే 14.9mm మందం ఉంటుంది.
