Samsung Galaxy Z Fold 7 : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ధర జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy Z Fold 7 : అమెజాన్ దీపావళి సేల్‌లో అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.. 200MP కెమెరాతో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రూ.51వేలు తక్కువకే లభ్యమవుతోంది. ఈ అదిరే డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- October 30, 2026 / 03:33 PM IST
Samsung Galaxy Z Fold 7
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు
- శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీపై భారీ తగ్గింపు
- 12GB+256GB వేరియంట్ ధర రూ.1,29,999
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీపై తగ్గింపు
Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ర్యామ్ మెమరీకి హై డిమాండ్, అలాగే స్పేర్ పార్టుల ధరల పెంపుతో చాలా స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగిపోతుండగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి ఎడిషన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీపై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది..
ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.26వేలకు పైగా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8-అంగుళాల QXGA+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.5-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ కవర్ డిస్‌ప్లే ఉన్నాయి.
ధర, ఆఫర్లు :
రూ.1,74,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీ ఫోన్ (12GB+256GB) ధర ఇప్పుడు రూ.1,29,999కి తగ్గింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.6,500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ధర రూ.1,23,499కి తగ్గింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ.51,500 తక్కువకే సొంతం చేసుకోవచ్చు..
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 అపర్చర్‌తో 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 10MP 3x టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10MP ప్రైమరీ ఫ్రంట్ కెమెరా ఎఫ్/2.2 అపర్చర్‌తో 10MP సెకండరీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ8పై రన్ అవుతుంది. 1856×2160 పిక్సెల్స్ రిజల్యూషన్ 2,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 8-అంగుళాల QXGA+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ లోపలి డిస్‌ప్లే ఉంది.
ఇందులో 1080×2520 పిక్సెల్స్ రిజల్యూషన్ 21:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,400mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
