Samsung Foldable Phones : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ 3 ఫోల్డబుల్ ఫోన్లు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు.. ధర జస్ట్..!

Samsung Foldable Phones : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఇప్పుడు భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ల కొనుగోలుపై కంపెనీ రూ. 8వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

Samsung Foldable Phones

  • భారత మార్కెట్లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  • ఈ మూడు ఫోల్డబుల్ ఫోన్లు మీ బడ్జెట్ ధరలోనే కొనొచ్చు
  • రూ. 8వేల వరకు క్యాష్ బ్యాక్, మరెన్నో బ్యాంకు డిస్కౌంట్లు

Samsung Foldable Phones : శాంసంగ్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు.. గత నెలలో లాంచ్ అయిన శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఉన్నాయి. ఈ 3 ఫోల్డబుల్ ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్లు ఇప్పుడు చౌకైన ధరకే లభిస్తున్నాయి. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

సేల్ ఆఫర్ ఏంటి? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 రూ.1,79,999 ప్రారంభ ధరతో (Samsung Foldable Phones) లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB ర్యామ్+ 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 1TB అనే 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లో కొనేసుకోవచ్చు.

ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 8వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కంపెనీ రూ. 7వేల బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత రూ. 1,71,999 ప్రారంభ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.

12GB ర్యామ్ + 256GB : రూ. 1,79,999
12GB ర్యామ్ + 512GB : రూ. 1,99,999
16GB ర్యామ్ + 1TB : రూ. 2,39,999

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అల్ట్రా ఫోన్ రూ. 1,99,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 1TB అనే 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 8వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Motorola Edge 70 Pro : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఈ కొత్త మోటోరోలా ఫోన్ సగం ధరకే.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

అదనంగా, రూ. 7వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,91,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

12GB ర్యామ్ + 256GB : రూ. 1,99,999
12GB ర్యామ్ + 512GB : రూ. 2,19,999
16GB ర్యామ్ + 1TB : రూ. 2,59,999

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఫోన్ భారత మార్కెట్లో రూ.1,24,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్+ 512GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. కొనుగోళ్లపై రూ. 5వేల వరకు క్యాష్‌బ్యాక్, రూ. 4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

మీరు రూ. 1,19,999 ప్రారంభ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు. శాంసంగ్ ఈ ఫోల్డబుల్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి రానుంది.

12GB ర్యామ్ + 256GB : రూ. 1,24,999
12GB ర్యామ్ + 512GB : రూ. 1,44,999

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9, వాచ్ అల్ట్రా 2 సేల్స్ :
శాంసంగ్ ప్రీమియం వాచ్ అల్ట్రా 2 మోడల్ రూ. 64,999 ప్రారంభ ధరతో లాంచ్ కాగా రూ. 9,500 వరకు తగ్గింపుతో లభిస్తోంది. మరోవైపు, గెలాక్సీ వాచ్ 9 రూ. 37,999 ప్రారంభ ధరతో లాంచ్ కాగా ధర రూ. 6,500 వరకు తగ్గింపుతో లభిస్తోంది.