Sarvam AI
Sarvam AI : సర్వం ఏఐ అనేది బెంగళూరుకు చెందిన టెక్నాలజీ కంపెనీ. ఇటీవలే మోడల్ ChatGPT కన్నా మెరుగ్గా పనిచేస్తుందని చెప్పుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ పూర్తిగా దేశంలోని సొంత పెద్ద లాంగ్వేజీ మోడల్స్ నిర్మించడంలో పాపులర్ అయింది. ఇప్పుడు, ఏఐ సంస్థ ఇండస్ అనే కొత్త ప్రొడక్టుతో వినియోగదారుల మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఇండస్‌ను ఏఐ అసిస్టెంట్ యాప్‌గా ప్రారంభించింది.
ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. అనేక టెక్ లాంచ్‌ల మాదిరిగా కాకుండా భారీ ఈవెంట్ లేదా భారీ ప్రమోషన్ లేదు. ఈ యాప్ సైలెంట్‌గా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో కనిపించింది.
ఆసక్తిగల వినియోగదారులు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాక్సెస్ లిమిట్ గానే అందిస్తుంది. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం సర్వం ఏఐ యాప్ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కంపెనీ టెస్టింగ్ చేస్తోంది.
ఇండస్ అనేది సర్వం ద్వారా ప్రత్యేకంగా భారతీయ యూజర్లు, ల్యాండ్‌స్కేప్ కోసం రూపొందించిన ఏఐ అసిస్టెంట్. ఈ యాప్ మల్టీలాంగ్వేష్ సంభాషణలపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది.
వినియోగదారులు సెషన్‌ను రీస్టార్ చేయకుండానే ఇంగ్లీషులో చాట్ చేయవచ్చు. హిందీ భాషలోకి మధ్యలోకి మారవచ్చు. సెషన్ ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతుందని ఏఐ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రజలు రోజువారీ జీవితంలో సహజంగా ఎలా మాట్లాడతారో అలానే ఈ అసిస్టెంట్ వర్క్ అవుతుందని తయారీదారులు తెలిపారు.
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర పాపులర్ ఏఐ చాట్ టూల్స్ మాదిరిగానే సర్వం ఇండస్ కూడా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. అన్ని అంశాలను వివరించగలదు. ఆన్‌లైన్‌లో సమాచారం కోసం సెర్చ్ చేయగలదు. ఇంకా, ఈ యాప్ వాయిస్ ఇంటరాక్షన్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు టైప్ చేయడానికి బదులుగా వారి ప్రశ్నలను మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది.
సర్వం ఇండస్ ఫీచర్లు :
సర్వం ఇండస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు. ఈ యాప్ యూజర్ల లోపల నేరుగా డాక్యుమెంట్లను రాసేందుకు ఎడిట్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. నోట్స్ రాసేందుకు అసైన్‌మెంట్ కోసం కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఆసక్తిగల యూజర్లు పీడీఎఫ్, ఫొటోల వంటి ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేయవచ్చు.
మీరు ఫైల్ అప్‌లోడ్ చేశాక ఏఐ రీడ్ చేసి అర్థం చేసుకుంటుంది. అప్పుడు మీరు ఫైల్ గురించి ప్రశ్నలు అడగవచ్చు. అసిస్టెంట్ ఆ డాక్యుమెంట్ నుంచి డేటాను ఉపయోగించి సమాధానం ఇస్తుంది. యాప్ లోపల అన్ని టాస్కులను ఆటోమేట్ చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని ఏఐ ఏజెంట్లు చేర్చే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
సర్వం ఇండస్ ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మీ ఫోన్‌లో స్టోర్‌కి వెళ్లి ఇండస్ బై సర్వం కోసం సెర్చ్ చేయండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా, ఇండస్ బై సర్వం వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి ఇండస్ బై సర్వం కోసం సెర్చ్ చేయాలి. ఆపై ఫస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీరు కొత్త యూజర్ అయితే.. మీ ఫోన్ నంబర్, గూగుల్ అకౌంట్ లేదా ఆపిల్ ఐడీని ఉపయోగించి సైన్ అప్ చేసుకోవాలి. అప్పుడు మీరు వెయిట్‌లిస్ట్‌లో చేరతారు. మీకు ఇన్వైట్ కోడ్ ఉంటే.. మీరు వెయిట్‌లిస్ట్‌ను స్కిప్ చేసి వెంటనే యాప్‌ను వాడొచ్చు.
ఏ మోడల్ ఆధారంగా రూపొందించారు? :
సర్వం ఇండస్ అనేది అధికారికంగా చాట్‌బాట్‌ను మోడల్‌ను వెరిఫై చేయలేదు. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ సర్వం 30B లేదా సర్వం 105Bని మోడల్ వాడుతున్నారని సూచిస్తోంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కంపెనీ లాంచ్ చేసిన రెండు భారీ లాంగ్వేజీ మోడల్స్ (LLM) ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలు ఇంకా వెల్లడి కాలేదు.