SIM Card Rules : 90 రోజులు రీఛార్జ్ చేయకపోతే నంబర్ పోతుందా? సిమ్ కార్డు పనిచేయదా? యూజర్లు ఏం చేయాలంటే?

SIM Card Inactivity Rules : సిమ్ కార్డు ఇన్ యాక్టివిటీ రూల్స్ మీకు తెలుసా? 90 రోజుల తర్వాత మీ సిమ్ కార్డు ఇన్ యాక్టివ్ అయితే ఏం చేయాలంటే? ఫుల్ డిటెయిల్స్

SIM Card Inactivity Rules

  • 90 రోజులు రీఛార్జ్ చేయకుండా ఉండే సిమ్ కార్డు పనిచేయదా?
  • ముందుగా ఔట్ గోయింగ్ సర్వీసు నిలిచిపోతుంది
  • కొద్ది రోజులకు ఇన్ కమింగ్ కూడా కట్ అయిపోతుంది
  • సిమ్ కార్డు రూల్స్ ఏంటి? మూడు నెలలు రీఛార్జ్ లేకుంటే ఎలా?

SIM Card Inactivity Rules : మీ మొబైల్ ఫోన్ లో రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీరు 90 రోజుల పాటు మీ నంబర్‌ను రీఛార్జ్ చేయకపోతే ఆ తర్వాత సిమ్ డీయాక్టివేట్ అవుతుందా? లేదా కొంత సమయం ఇస్తారా? ఈ ప్రశ్న చాలా మందికి ఉండే ఉంటుంది. 90 రోజులు వాడని ఫోన్ నెంబర్లు ఇక పనిచేయవా? టెల్కో కంపెనీలు ఇన్ యాక్టివ్ సిమ్ కార్డులను ఏం చేస్తాయో తెలుసా?

సాధారణంగా సెకండరీ సిమ్ కార్డు వాడే యూజర్లు 90 రోజుల (SIM Card Rules) తర్వాత సిమ్ నిజంగా డీయాక్టివేట్ అవుతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే.. చాలామంది వినియోగదారులు చాలాసార్లు ప్రైమరీ సిమ్‌ను మాత్రమే సరైన సమయానికి రీఛార్జ్ చేస్తారు.

కానీ, సెకండరీ సిమ్‌ను మాత్రం అలా రీఛార్జ్ చేయరు. మీరు కూడా అలాగే చేస్తే.. 90 రోజుల తర్వాత సిమ్ డీయాక్టివేట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Bestune Xiaoma Electric Car : ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1200 కి.మీ రేంజ్.. ఈ ఎలక్ట్రిక్ కారు ధర జస్ట్ రూ. 3.47 లక్షలే.. ఫీచర్ల కోసమైన కొనొచ్చు!

మీరు 90 రోజుల పాటు SMS పంపకపోయినా కాల్స్ చేయకపోయినా లేదా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయకపోయినా కంపెనీ మీ నంబర్‌ను ఇనాక్టివ్ కేటగిరీలో పెట్టవచ్చు. తద్వారా మొదట అవుట్‌గోయింగ్ సర్వీస్ నిలిచిపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సిమ్‌కు ఇన్‌కమింగ్ సర్వీస్ కూడా బ్లాక్ అవుతుంది.

90 రోజుల పాటు సిమ్ ఇన్ యాక్టివ్ ఉంటే.. :
జియో అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. మీ సిమ్ 90 రోజుల పాటు ఇన్‌యాక్టివ్ ఉండి మీ మెయిన్ ఖాతాలో రూ. 20 బ్యాలెన్స్ ఉంటే.. కంపెనీ ఆ బ్యాలెన్స్‌ను తీసేసుకుంటుంది.

మీ ఫోన్ నంబర్ గ్రేస్ పీరియడ్ 30 రోజులు పొడిగిస్తుంది. మీ మెయిన్ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ వాడకూడని కాలం పొడిగించబడుతూనే ఉంటుంది. కానీ, మీ ప్రధాన ఖాతాలోని బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే మీ నంబర్ ఇన్ యాక్టివ్ అయిపోతుంది.

మీ ఖాతాలో రూ. 20 బ్యాలెన్స్ లేకుంటే ఏమవుతుంది? :
90 రోజుల పాటు మొబైల్ నంబర్‌ను ఉపయోగించని పక్షంలో కంపెనీలు వినియోగదారులకు 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ సమయంలో రీయాక్టివేషన్ ఛార్జీ చెల్లించడం ద్వారా లేదా రీఛార్జ్ చేయడం ద్వారా మీ నంబర్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.

అయితే, మీరు గ్రేస్ పీరియడ్‌లో రీచార్జ్ చేయకపోతే 15 రోజుల తర్వాత ఆ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది. ఒకసారి నంబర్ డీయాక్టివేట్ అయ్యాక కంపెనీ మరుసటి రోజే అదే నంబర్‌ను మరొక వ్యక్తికి తిరిగి జారీ చేయవచ్చు.