Summer AC Tips : మీ ఇంట్లో AC కూలింగ్ తగ్గితే వెంటనే ఇలా చేయండి.. కొత్త ACలా ఎక్కువ కూలింగ్.. తక్కువ పవర్ బిల్స్..!
Summer AC Tips : పాత ఏసీని ముందుగానే సర్వీసింగ్ చేయించండి. వేసవిలో ఏసీలు ఎక్కువ సమయం రన్ అవుతుండాలి. ఇలాంటి అప్పుడు ఏసీల భారీగా వాడినా కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది..
- Sreehari A
- Published On : March 19, 2026 / 04:01 PM IST
Summer AC Tips
Summer AC Tips : మీ ఇంట్లో ఏసీ ఉందా? ఎండలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో వేడి ఎక్కువగా ఉంటోంది. కాసేపు కూలర్, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. వేసవి సీజన్ సమయంలో ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వినియోగం భారీగా పెరుగుతుంది.
చాలా మంది ఏసీలో ఏదైనా సమస్య వచ్చిన తర్వాతే సర్వీసింగ్ చేయిస్తారు. కానీ, ముందుగానే రొటీన్ సర్వీసింగ్ చేయడం వల్ల ఏసీలో రిపేరింగ్ సమస్యలు రాకుండా నివారించవచ్చు. వేసవిలో ఏసీ సర్వీసింగ్ సంబంధించి పుల్ గైడ్ మీకోసం అందిస్తున్నాం..
మీ ఇంట్లో పాత ఏసీలు ఉంటే వెంటనే సర్వీసింగ్ చేయించండి. ఆ తర్వాత వినియోగించండి. డబ్బు ఆదాతో పాటు పవర్ బిల్లు కూడా ఆదా అవుతుంది. అదే కొత్తది కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.
కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది :
పాత ఏసీని మంచిగా సర్వీసింగ్ చేయిస్తే ఏసీ కొత్త దానిలా పనిచేస్తుంది. గదిని వేగంగా కూలింగ్ చేస్తుంది. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే మిషన్ ఎక్కువకాలం వస్తుంది. వేసవి మొదలయ్యే ముందు ఏసీని సర్వీస్ చేయించుకోవడం చాలా అవసరం.
ఏసీలో ఉండే ముఖ్యమైన భాగాల్లో ఎయిర్ ఫిల్టర్ ఒకటి. గాలిని వేగంగా కంట్రోల్ చేయగలదు. డస్ట్, అలెర్జీ కారకాలను అడ్డుకుంటుంది. ఫిల్టర్‌లో ధూళి పేరుకుపోతే కూలింగ్ తగ్గిపోతుంది. సర్వీసింగ్ సమయంలో ఫిల్టర్‌ను క్లీన్ చేయించాలి? లేదంటే కొత్తది మార్చడం చాలా ముఖ్యం.
ఇలా చేస్తే ఏసీ సరైన కూలింగ్ ఇవ్వదు :
అలాగే రిఫ్రిజిరెంట్ గ్యాస్ లెవల్ కూడా చాలా కీలకం. గ్యాస్ తగ్గినా కూడా ఏసీ సరైన కూలింగ్ ఇవ్వదు. టెక్నీషియన్ ప్రెషర్ టెస్టింగ్ చేసి లీకేజీలు ఉంటే సరిచేసి గ్యాస్‌ను రీఫిల్ చేస్తారు. కండెన్సర్, ఎవాపొరేటర్ కాయిల్స్‌ను క్లీన్ చేయడం కూడా కూలింగ్ కెపాసిటీని పెంచుతుంది. డ్రెయిన్ పైప్‌లో మురికి పేరుకుపోయినా నీటి లీకేజ్ సమస్యలు వస్తాయి.
అందుకే ఏసీని తప్పినిసరిగా క్లీన్ చేస్తుండాలి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్, కెపాసిటర్స్, థర్మోస్టాట్ వంటి పార్టులు సరిగా పనిచేస్తేనే ఏసీ స్టేబుల్ టెంపరేచర్ వద్ద కూలింగ్ ఉంచుతుంది. ఒకవేళ మీరు అవుట్‌డోర్ యూనిట్ దగ్గర ఏదైనా దుమ్ము, ఎండిన ఆకులు పేరుకుపోయి ఉంటే వెంటనే క్లీన్ చేయాలి.
వేసవిలో సడెన్ గా ఏసీ పాడైపోతే వెంటనే సర్వీస్ చేయించడం చాలా కష్టం. అందుకే ముందుగానే సర్వీసింగ్ చేయించుకుంటే ఎక్కువ కూలింగ్, తక్కువ విద్యుత్ బిల్లు, ఏసీ ఎక్కువకాలం రన్ అవుతుంది.
