Tech Tips : మీ PAN కార్డు పనిచేస్తుందో లేదో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్.. ఇలా చెక్ చేసుకోండి..!

Tech Tips : మీకు పాన్ కార్డు ఉందా? మీ పాన్ కార్డు (PAN) పనిచేస్తుందో లేదో ఎప్పుడైనా చెక్ చేశారా? పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్‌ (Permanent Account Number) కార్డును ఆధార్ కార్డ్‌ (Aadhaar Card)తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంది.

Tech Tips : మీకు పాన్ కార్డు ఉందా? మీ పాన్ కార్డు (PAN) పనిచేస్తుందో లేదో ఎప్పుడైనా చెక్ చేశారా? పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్‌ (Permanent Account Number) కార్డును ఆధార్ కార్డ్‌ (Aadhaar Card)తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం.. మార్చి 31, 2023లోపు పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విఫలమైతే.. పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. ఒకసారి PAN పనికిరాకుండా పోయిన తర్వాత PAN హోల్డర్లు PANకి లింక్ చేసిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించలేరు.

అన్ని ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్‌లు కూడా నిలిచిపోతాయి. మినహాయింపు కేటగిరీ కిందకు వచ్చేవారు మినహా భారతీయ పౌరులందరికీ పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఇందులో అసోం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నివాసితులు కానివారు, 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు, భారత పౌరులు కానివారు తప్పనిసరిగా పాన్ కార్డును లింక్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోండి.. ఏప్రిల్ 1, 2023 నుంచి అన్‌లింక్ చేసిన PANలు పనికిరావని నివేదిక పేర్కొంది.

పాన్-ఆధార్ లింక్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే? :
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేందుకు చివరి తేదీ మార్చి 31 2023. రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయని వ్యక్తులు అధికారిక పోర్టల్ (incometax.gov.in)ని విజిట్ చేయడం ద్వారా లింకింగ్ (/iec/foportal) ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఈ లింకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రూ. 1000 రుసుము చెల్లించాలి. పాన్‌ను ఆధార్ కార్డ్‌తో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. మార్చి 31 గడువులోగా పాన్, ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి. ఆ గడువు దాటితే పాన్ కార్డ్ పనిచేయదు.

Tech Tips : How to check if your PAN Card is valid or not

Read Also : PAN-Aadhaar Link : మీ ఆధార్- పాన్ కార్డు ఇంకా లింక్ చేయలేదా? ఈ తేదీలోగా SMS ద్వారా వెంటనే లింక్ చేయండి.. ఇదిగో ప్రాసెస్..!

అయితే, ఈ గడువును మరింత పొడిగిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మీ పాన్ కార్డ్ ఇప్పటికీ చెల్లుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌ను విజిట్ చేయడం ద్వారా మీ పాన్ కార్డును ధృవీకరించవచ్చు. PAN కార్డ్‌ వ్యాలిడిటీని చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం, మల్టీ పాన్ కార్డ్‌లు ఉన్నవారి పాన్ కార్డ్‌లను ప్రభుత్వం డియాక్టివేట్ చేస్తుంది.

ఆన్‌లైన్‌లో మీ పాన్ కార్డ్ పనిచేస్తుందో ఉందో లేదో చెక్ చేయాలంటే? :
మీ PAN కార్డ్ తనిఖీ చేసేందుకు (incometaxindiaefiling.gov.in/home)లో ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
– వెబ్ పేజీకి ఎడమ వైపున ఉన్న ‘Verify Your PAN Details’ లింక్‌పై Click చేయండి.
– ఫీల్డ్‌లో మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
– పాన్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి.
– ఇప్పుడు పేజీలో కనిపించే విధంగా Captcha కోడ్‌ను ఎంటర్ చేయండి.
– ‘Submit’పై Click చేయండి.
– మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందా లేదా Status మెసేజ్ కనిపిస్తుంది.

SMS ద్వారా పాన్ కార్డ్ పనిచేస్తుందో లేదో చెక్ చేయడం ఎలా? :
మీరు ఈ కింది ఫార్మాట్‌లో NSDL PAN అని టైప్ చేసి 567678 లేదా 56161కి SMS పంపడం ద్వారా మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేయవచ్చు
– ఉదాహరణకు, మీ పాన్ నంబర్ ABCDE1234F అయితే.. మీరు ఈ కింది మెసేజ్ NSDL PAN ABCDE1234F ఇలా పంపాలి.
– SMS పంపిన తర్వాత.. మీ PAN కార్డ్ యాక్టివ్‌గా ఉన్నా లేదా లేకపోయినా స్టేటస్ SMSని పొందవచ్చు.
ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా, ఆర్థిక లావాదేవీలను సజావుగా నిర్వహించేందుకు పర్సనల్ డేటాను మోసం లేదా దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్ వ్యాలిడిటీని చెక్ చేయవచ్చు.

Read Also : Download e-PAN card Online : మీ పాన్‌కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో ఇలా పొందొచ్చు!

ట్రెండింగ్ వార్తలు