Tecno Camon 50 Ultra 5G : బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్.. టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ అదుర్స్.. ధర జస్ట్ ఎంతంటే?
Tecno Camon 50 Ultra 5G : భారత మార్కెట్లోకి టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ టెక్ కంపెనీ రూ.3వేలు విలువైన లాంచ్ కూపన్ కూడా అందిస్తోంది.
- Sreehari A
- Published on- July 17, 2026 / 03:28 PM IST
Tecno Camon 50 Ultra 5G
- టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీలో 3 రియర్ కెమెరాలు
- 7.75mm మందం, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది
- 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు
Tecno Camon 50 Ultra 5G : టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో వస్తుంది. కొత్త కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
144Hz వరకు రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌ను ProXDR కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీలో 6,500mAh బ్యాటరీ కూడా ఉంది. రెండు (Tecno Camon 50 Ultra 5G) రోజుల కన్నా లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
భారత్‌లో టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ధర :
భారత మార్కెట్లో టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ధర రూ. 39,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ టెక్ కంపెనీ రూ.3వేలు విలువైన లాంచ్ కూపన్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 36,999కి తగ్గింది. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. జూలై 21న అమెజాన్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ ఫోన్ సైప్రస్ గ్రీన్, మిస్టీ పర్పుల్ నెబ్యులా టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
టెక్నో కామన్ 50 అల్ట్రా 5జీ అనేది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై సింగిల్ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. 6.78-అంగుళాల 1.5K (1,208 x 2,644 పిక్సెల్స్) ProXDR కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
144Hz వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 2,800Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తుందని టెక్ సంస్థ పేర్కొంది. మన్నిక కోసం MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా అందిస్తుంది.
4nm ప్రాసెస్‌పై ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. 6,500mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్, GLONASS, BeiDouలకు కూడా సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. 7.75mm మందంతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. :
టెక్నో కామన్ 50 అల్ట్రాలో 50ఎంపీ (ఎఫ్/1.8) మెయిన్ షూటర్, 1/1.56-అంగుళాల సోనీ ఎల్‌వైటీ-700సీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 3x వరకు ఆప్టికల్ జూమ్ 50MP (ఎఫ్/2.4) టెలిఫోటో కెమెరా, 112-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ 8MP (ఎఫ్/2.2) అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4K/30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు.
