Tecno Spark 50S 5G Launch : టెక్నో స్పార్క్ 50S 5G వచ్చేసింది.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టే ఫీచర్లు!

Tecno Spark 50S 5G Launch : భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ 50S 5జీ లాంచ్ అయింది. ప్రారంభ ధర రూ.19,999 మాత్రమే.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు, అమెజాన్ సేల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

Tecno Spark 50S 5G Launch

  • టెక్నో కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర రూ.19,999, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
  • బడ్జెట్‌లో పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్.. టెక్నో స్పార్క్ 50S ఫీచర్లు ఇవే
  • 6,500mAh బ్యాటరీతో టెక్నో కొత్త ఫోన్.. ధర, కెమెరా, స్పెసిఫికేషన్లు

Tecno Spark 50S 5G Launch : టెక్నో లవర్స్ మీకోసమే.. చైనాకు టెక్నో కంపెనీ భారత మార్కెట్‌లోకి మరో కొత్త 5G ఫోన్‌ ప్రవేశపెట్టింది. టెక్నో స్పార్క్ 50S 5జీ పేరుతో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టెక్నో స్పార్క్ 50S 5జీ ధర ఎంత? :
టెక్నో స్పార్క్ 50S 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, బర్గండీ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.

Read Also : Bank Holiday Update : మహా సప్తమి ఎఫెక్ట్.. అక్టోబర్ 17న బ్యాంకులు బంద్? ఖాతాదారులు తప్పక తెలుసుకోండి..!

120Hz డిస్‌ప్లే.. పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం స్పెషల్ అట్రాక్షన్. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్‌కు బెటర్.

50MP కెమెరా.. భారీ బ్యాటరీ :
ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50MP రియర్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6,500mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

కనెక్టివిటీ పరంగా 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు సుమారు 210 గ్రాములు ఉంటుంది. భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి టెక్నో స్పార్క్ 50S 5జీ అద్భుతమైన ఆప్షన్. అయితే, కొనుగోలు చేసే ముందు ధరతో పాటు ఇతర ఫోన్ల ఫీచర్లను కూడా కంపేర్ చేసి చూడటం మంచిది.