BSNL Offer : BSNL బంపర్ ఆఫర్.. ఈ సింగిల్ చీపెస్ట్ ప్లాన్‌తో 50GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్.. మీ ఫ్యామిలీలో 3 సిమ్‌లకు వాడేసుకోవచ్చు..!

BSNL Offer : ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కస్టమర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో 3 సిమ్ కనెక్షన్‌లకు ఫ్రీ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 50GB డేటా కూడా పొందవచ్చు.

BSNL Cheapest Plan

BSNL Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రిలయన్స జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ మధ్య పోటీ తీవ్రమైంది. ప్రతి టెలికం ప్రొవైడర్ ఆకర్షణీయమైన ఆఫర్‌లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also : Buying Gold : బంగారం కొనాలంటే లక్షలకు లక్షలు అక్కర్లేదు.. జస్ట్ 100 రూపాయలతో కొనొచ్చు.. ఇలా చేయండి..!

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు రీఛార్జింగ్ మొత్తం ఖర్చును తగ్గించే లక్ష్యంతో BSNL వినూత్న ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఒక ప్లాన్ ధరకే మూడు సిమ్ కనెక్షన్‌లకు కనెక్ట్ చేయొచ్చు.

ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఆసక్తిగల కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ లేదా BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ఈజీగా పొందవచ్చు.

BSNL రూ.798 రీఛార్జ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ కోసం రూ.798 ధరకు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వ్యక్తి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. రెండు అదనపు సిమ్‌లకు కనెక్ట్ చేయొచ్చు. దాంతో ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులు విడివిడిగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాన్‌తో అందరూ అన్ని బెనిఫిట్స్ వాడుకోవచ్చు.

రూ.798 ప్లాన్ బెనిఫిట్స్ విషయానికొస్తే.. BSNL ప్రైమరీ యూజర్లకు మాత్రమే కాకుండా ఇతర కనెక్ట్ చేసిన యూజర్లకు కూడా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తోంది. ప్రతి యూజర్ 50GB డేటాను అందుకోవచ్చు. మొత్తం అన్ని కనెక్షన్లలో 150GB డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో అన్ని వినియోగదారులకు రోజుకు 100 ఉచిత SMS, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉన్నాయి. ఇప్పుడు BSNL వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌లోని కవరేజ్ మ్యాప్‌లను చెక్ చేసి, తమ ప్రాంతాల్లో 4G లేదా 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.

Read Also : Google Pixel 8a : భలే డిస్కౌంట్ భయ్యా.. రూ.53వేల గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ కేవలం రూ.13వేలకే.. ఇలా కొనేసుకోండి..!

ఈ అద్భుతమైన ఫీచర్ వినియోగదారులు BSNLకి మారేందుకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే.. ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్ కవరేజ్ సమాచారాన్ని కస్టమర్లకు షేర్ చేయాల్సిందిగా సూచించింది.