Buying Gold : బంగారం కొనాలంటే లక్షలకు లక్షలు అక్కర్లేదు.. జస్ట్ 100 రూపాయలతో కొనొచ్చు.. ఇలా చేయండి..!

Buying Gold : బంగారం కొంటున్నారా? బంగారాన్ని కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మీరు కేవలం రూ.100 ఖర్చుతో బంగారాన్ని ఈజీగా కొనేసుకోవచ్చు. ఇంతకీ మీరు చేయాల్సిందిల్లా..

Buying Gold : బంగారం కొనాలంటే లక్షలకు లక్షలు అక్కర్లేదు.. జస్ట్ 100 రూపాయలతో కొనొచ్చు.. ఇలా చేయండి..!

Buying Gold

Updated On : April 22, 2025 / 11:39 AM IST

Buying Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనేందుకు చూస్తున్నారా? మార్కెట్లో బంగారం లక్షలు దాటేస్తోంది.. అన్ని లక్షలు పోసి బంగారం కొనేదెట్టా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి.. బంగారం కొనేందుకు మీరు లక్షలు పోయక్కర్లేదు.. కేవలం రూ.100తో బంగారం కొనేసుకోవచ్చు.

లక్షల మార్క్ చేరువైన బంగారం వంద రూపాయలకు ఎలా వస్తుంది అంటారా? అవును మీరు చదివింది నిజమే.. బంగారం కొనడం అంటే.. భౌతిక బంగారం (ఫిజికల్ గోల్డ్) కాదండీ.. డిజిటల్ గోల్డ్.. మీరు డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తే మీరు కోరుకున్న బంగారాన్ని ఈజీగా కొనేసుకోవచ్చు అనమాట.

Read Also : Samsung One UI 7 : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. భారత్‌కు వన్ UI 7 అప్‌డేట్.. ఫీచర్లు ఏంటి? సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. ఇందులో మీ ఫోన్ ఉందా?

ప్రస్తుత రోజుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం.. సాధారణంగా బంగారంపై పెట్టుబడి పెట్టే విధానం మీరు పెట్టుబడి పెట్టే బంగారం పరిమాణంపై కూడా ఆధారపడి ఉంటుంది. అదే ఫిజికల్ గోల్డ్ అనేది.. భౌతిక రూపంలో కొనుగోలు చేయొచ్చు. అదే డిజిటల్ గోల్డ్ అయితే.. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

అందులో ఆన్‌లైన్ వ్యాలెట్లు, ఫిన్‌టెక్ యూప్స్ డిజిటల్ బంగారాన్ని అందిస్తాయి. మీరు ప్రస్తుత ఫిజికల్ గోల్డ్ మార్కెట్ రేటు ప్రకారమే డిజిటల్ గోల్డ్ కూడా కొనేసుకోవచ్చు. ఈ బంగారాన్ని భౌతికంగా చూడలేరు. డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా ఒక గ్రాము బంగారం కొనుగోలు చేయొచ్చు.

అందులో ప్రధానంగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. SIP ప్లాన్లను కూడా ఎంచుకోవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అందించే అనేక రకాల మ్యూచువల్ ఫండ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. సావరిన్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్స్ వంటివి చాలానే ఉన్నాయి.

అయితే, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కనీసం పెట్టుబడి అనేది మీరు పెట్టుబడి పెట్టే బంగారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒక గ్రాము గోల్డ్ కాయిన్ సగటు ధర దాదాపు రూ. 6వేలు ఉంది. బంగారం ధర మారుతున్న కొద్ది రేటు మారిపోతుంది.

Read Also : China 10G Network : చైనాలో సూపర్ ఫాస్ట్ 10G నెట్‌వర్క్‌.. ప్రపంచంలోనే ఫస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. జస్ట్ సెకన్లలోనే 2 ఫుల్ మూవీలు డౌన్‌లోడ్ చేయొచ్చు..!

అదే మీరు సావరిన్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేముందు కనీస పెట్టుబడిగా రూ. 5వేలు. మీరు రూ.100తో కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. డిజిటల్ గోల్డ్ పెట్టుబడిని రూపాయితో కూడా మొదలుపెట్టవచ్చు. మీరు ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ రూపంలో పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు బంగారంపై 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది