Nothing Phone 4b Deal : సూపర్ డిస్కౌంట్.. నథింగ్ ఫోన్ 4b చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Nothing Phone 4b Deal : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో నథింగ్ ఫోన్ 4b చాలా చౌకగా లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 4b Deal

  • 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • నథింగ్ ఫోన్ 4bలో 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • 6,000mAh బ్యాటరీ సెటప్, రూ. 33వేల వరకు ఆదా

Nothing Phone 4b Deal : నథింగ్ ఫ్యాన్స్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో నథింగ్ ఫోన్ 4b అతి తక్కువ ధరకు లభిస్తోంది. మీ బడ్జెట్ సుమారు రూ. 35వేలు అయితే, ఈ నథింగ్ ఫోన్ మంచి డీల్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 4బి ధర తగ్గింపుతో లభిస్తోంది.

అలాగే, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ నథింగ్ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000mAh బ్యాటరీ ఉంది. నథింగ్ ఫోన్ 4బిపై డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

నథింగ్ ఫోన్ 4b ధర, ఆఫర్లు :

నథింగ్ ఫోన్ 4బి ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,999కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ (Nothing Phone 4b Deal) క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ. 4,719 డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో అసలు ధర రూ. 30,280 అవుతుంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 33వేల వరకు ఆదా చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Redmi Turbo 5 : రెడ్‌మి లవర్స్‌కు బిగ్ షాక్.. ఈ టర్బో 5 ఫోన్ భారీగా పెరిగిందోచ్.. ఇంతకీ కొనాలా? వద్దా?

నథింగ్ ఫోన్ 4b ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 4b ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 1080×2344 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్‌నెస్ 2,000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 4b క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 4.1పై రన్ అవుతుంది. కంపెనీ 3 ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ఈ ఫోన్ 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 400 చదరపు మిల్లీమీటర్ల హీట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
నథింగ్ ఫోన్ 4b ఫోన్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.4 అపర్చర్‌తో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000mAh బ్యాటరీ ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ అందించారు.