HMD 106 2G Price : స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టండి.. HMD 106 2G కొత్త ఫీచర్ ఫోన్‌తో మళ్లీ సింపుల్ లైఫ్!

HMD 106 2G Price : ఈ ఫోన్‌ను 'జీరో ల్యాగ్, జీరో డిస్ట్రాక్షన్' అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ లాంచ్ చేసింది. మీరు స్మార్ట్‌ఫోన్ నుంచి బ్రేక్ తీసుకుని ఫీచర్ ఫోన్ వాడాలని అనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్.

HMD 106 2G Price

  • ఈ HMD ఫోన్‌లో 2జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది
  • 1.8 అంగుళాల LCD డిస్‌ప్లే అదుర్స్
  • 32GB వరకు స్టోరేజ్‌, మైక్రో SD కార్డ్‌కు సపోర్టు

HMD 106 2G Price : స్మార్ట్ ఫోన్లతో విసిగిపోయారా? కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. మీకోసం హెచ్ఎండీ నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసింది. కేవలం 2G కనెక్టివిటీతో పనిచేసే హెచ్ఎండీ 106 2G ఫీచర్ ఫోన్ ఇది.. స్మార్ట్‌ఫోన్ వద్దనేవారికి డిజిటల్ డిటాక్స్ డివైజ్ అని చెప్పొచ్చు. అంటే.. నేటి ప్రపంచంలో ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్ గంటలకొద్ది వాడేస్తున్నారు.

కొంతకాలం ఈ స్మార్ట్‌ఫోన్‌కు బ్రేక్ ఇవ్వాలని అనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్. ఇందులో కెమెరా ఉండదు.. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం మాత్రమే ఈ ఫోన్‌ వాడుకోవచ్చు. అంతేకాదు.. సేఫ్టీ పరంగా చూస్తే IP52 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. హెచ్ఎండీ 106 2జీలో ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1000mAh బ్యాటరీ ఉంది. బ్లూటూత్ ఎఫ్ఎమ్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. ఇందులో పూర్తి ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ధర ఎంతంటే? :
హెచ్ఎండీ 106 2జీ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫోన్ మామూలు ఫీచర్ ఫోన్ (HMD 106 2G Price) కాగా అత్యంత సరసమైన ధరకు లభించనుంది. (Nokiamob.net) ప్రకారం ఈ ఫోన్ ధర త్వరలోనే వెల్లడి కానుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
హెచ్ఎండీ 106 2జీ ఫోన్ అనేది అద్భుతమైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను కేవలం కాల్స్ చేయడం, టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. కంపెనీ ‘జీరో ల్యాగ్, జీరో డిస్ట్రాక్షన్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది.

Read Also : OnePlus Ace 7 Pro : వన్‌ప్లస్ నుంచి ‘బాహుబలి’ ఫోన్? 200MP కెమెరాతో ఫుల్ మాస్.. స్పెక్స్ చూస్తే మైండ్ బ్లాంక్!

ఈ ఫోన్ కేవలం 2జీ కనెక్టివిటీని మాత్రమే అందిస్తుంది. ఇందులో 1.8-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. అలాగే 4MB ర్యామ్, 8MB ROM ఉన్నాయి. స్టోరేజ్‌ పెంచుకునేందుకు 32GB వరకు మైక్రో SD కార్డ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

హెచ్ఎండీ 106 2జీ ఫోన్ యూనిసోక్ 6533G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. S30+ OSపై రన్ అవుతుంది. ఇందులో 1000mAh రిమూబుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో కెమెరా లేదు. బ్లూటూత్ 4.2 కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎఫ్ఎమ్ రేడియో స్నేక్ గేమ్ కూడా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కార్డులు 3.5mm ఆడియో జాక్‌కు సపోర్ట్ చేస్తుంది.