Top 5 Camera Smartphones : ఈ దీపావళికి అదిరిపోయే టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Top 5 Camera Smartphones : ఈ దీపావళికి కొత్త కెమెరా ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ నుంచి శాంసంగ్ S26 అల్ట్రా, వివో X300 అల్ట్రా వరకు టాప్ 5 కెమెరా ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..

Top 5 Camera Smartphones

  • దీపావళి షాపింగ్‌లో బెస్ట్ కెమెరా ఫోన్ ఏది?
  • బాణసంచా నుంచి ఫ్యామిలీ ఫొటోల వరకు..
  • ఈ 5 కెమెరా ఫోన్ల ఫీచర్లు చూస్తే కొనాలనిపిస్తుంది

Top 5 Camera Smartphones : దీపావళి వచ్చిందంటే ఇళ్ల నిండా దీపాల వెలుగులు, బాణసంచా సందడి, కుటుంబ సభ్యులతో సరదా క్షణాలు.. ఇలా పండగ వాతావరణమే ప్రత్యేకంగా ఉంటుంది.
ఫొటోలు, వీడియోల కోసం మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. అందుకే ఈ పండగ సీజన్‌లో కొత్త ఫోన్ కొనేవారికి అదిరే కెమెరా ఫీచర్లతో 5 ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 11 ప్రో XL :
ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్.. 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో కెమెరాతో పాటు నైట్ సైట్, ఆస్ట్రోఫోటోగ్రఫీ వంటి ఫీచర్లు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు..

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా :
హైక్వాలిటీ ఫొటోలు, జూమ్ కెమెరా కావాలనుకునేవారికి అదిరిపోయే ఆప్షన్.. 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్, 10x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ వంటివి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి..

ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ :
ట్రిపుల్ 200MP రియర్ కెమెరా సెటప్‌తో ఫొటోగ్రఫీలో కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్, 8K వీడియో రికార్డింగ్ యూజర్లనుక ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read Also : Budget POCO Smartphones : అమెజాన్ బంపర్ సేల్‌.. తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలా? రూ.15 వేలలోపే పోకో స్మార్ట్‌ఫోన్లు..

ఐఫోన్ 18 ప్రో మాక్స్ :
వీడియోలు తీయడం ఇష్టపడేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్.. 48MP కెమెరా సిస్టమ్, 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్, 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్300 అల్ట్రా :
ZEISS ట్యూనింగ్‌తో 200MP మెయిన్, 200MP టెలిఫోటో కెమెరాలు అత్యంత ఆకర్షణ కాగా, 4K 120fps వీడియో రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి, ఈ 5 ఫోన్లలో ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది.

మీకు ఫొటోగ్రఫీ ముఖ్యమా, జూమ్ కావాలా, వీడియో క్వాలిటీ కావాలా అనే దాన్ని బట్టి ఆప్షన్ చేసుకోవచ్చు. అయితే, కొనుగోలు చేసే ముందు ధర, ఫీచర్లను అధికారికంగా మరోసారి చెక్ చేశాకే కొనడం బెటర్..