Top Gaming Smartphones : ఈ టాప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతంటే?

Top Gaming Smartphones : ప్రీమియం ఫీచర్లతో టాప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు..

Top Gaming Smartphones

Top Gaming Smartphones : కొత్త గేమింగ్ ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? హై స్టోరేజీ, హై-స్పీడ్ ప్రాసెసర్, బిగ్ ర్యామ్, భారీ డిస్‌ప్లే (Top Gaming Smartphones) కలిగిన అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ లిస్టులో ఐక్యూ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌ ఫోన్లు కూడా ఉన్నాయి.

ఇవన్నీ 5Gకి సపోర్టు ఇస్తాయి. ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లను అమేజింగ్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ మూడు గేమింగ్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఐక్యూ 13 5G :
ఈ ఐక్యూ 13 5G ఫోన్ 12GB ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 4.3 GHz క్లాక్ స్పీడ్‌తో అత్యంత స్పీడ్ సీపీయూతో లాగ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌‌తో 2K డిస్‌ప్లేతో వస్తుంది. అద్భుతమైన క్లియర్ గేమింగ్ విజువల్స్‌తో వస్తుంది. 6.82-అంగుళాల డిస్‌ప్లేలో 1800 నిట్స్ HBM, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఐక్యూ 13 5G ఫోన్ రూ. 54,998కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Oppo Find X8 Pro Sale : ఒప్పోనా మజాకా.. అతి చౌకైన ధరకే ఒప్పో ఫైండ్ X8 ప్రో.. అమెజాన్‌‌లో ఇలా కొన్నారంటే..!

వన్‌ప్లస్ నార్డ్ 5 :
ఈ వన్‌ప్లస్ ఫోన్ టాప్ బ్రాండింగ్‌తో వస్తుంది. 50MP ఫ్లాగ్‌షిప్ కెమెరా కలిగి ఉంది. స్టేబుల్ 144FPS గేమింగ్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 256GB హెవీ స్టోరేజ్‌తో స్లిమ్, స్లీక్ డిజైన్‌లో వస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం BGMI, COD వంటి గేమ్‌లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్క్రీన్ కూడా చాలా బాగుంది. అమెజాన్ నుంచి రూ. 31999కి కొనుగోలు చేయవచ్చు.

వివో V60 5G :
వివో లేటెస్ట్ మోడల్ ఫోన్. ఈ వివో V60 5G ఫోన్ 5G కనెక్టివిటీతో హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌తో వస్తుంది. ప్రొఫెషనల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫొటోలు, వీడియోలను షూట్ చేయవచ్చు. దాంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. IP68, IP69 రేటింగ్‌లతో రూ. 38,999కు లభిస్తుంది.