Oppo Find X8 Pro Sale : ఒప్పోనా మజాకా.. అతి చౌకైన ధరకే ఒప్పో ఫైండ్ X8 ప్రో.. అమెజాన్‌‌లో ఇలా కొన్నారంటే..!

Oppo Find X8 Pro : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 21,700 డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.

Oppo Find X8 Pro Sale : ఒప్పోనా మజాకా.. అతి చౌకైన ధరకే ఒప్పో ఫైండ్ X8 ప్రో.. అమెజాన్‌‌లో ఇలా కొన్నారంటే..!

Oppo Find X8 Pro

Updated On : August 22, 2025 / 4:59 PM IST

Oppo Find X8 Pro Sale : మీ స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ డీల్ మీకోసమే.. అమెజాన్ ప్రస్తుతం ఒప్పో ఫైండ్ X8 ప్రోపై రూ. 21,700 కన్నా భారీ డిస్కౌంట్ (Oppo Find X8 Pro) అందిస్తోంది.

మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఒప్పో ఫైండ్ X8 ప్రో పవర్‌ఫుల్ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. టాప్ రేంజ్ ఫోన్ డీల్ వివరాలను ఓసారి లుక్కేయండి. ఇంతకీ ఈ ఆఫర్‌ ఎలా పొందాలంటే?

ఒప్పో ఫైండ్ X8 ప్రో అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ రూ.99,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం రూ.81,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై రూ.18వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,750 తగ్గింపును పొందవచ్చు. ఇంకా సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Jio Recharge : జియో రూ. 249 కన్నా 5 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 4500 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. స్క్రీన్ డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ కోసం 5910mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50MP సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌ అందించే 50MP సోనీ IMX858 సెన్సార్, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.