Reliance Jio Recharge : జియో రూ. 249 కన్నా 5 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Reliance Jio Recharge : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 249 చీపెస్ట్ ప్లాన్ లేకున్నా దానికి మించిన 5 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి..

Reliance Jio Recharge
Reliance Jio Recharge : రిలయన్స్ జియో ఇటీవలే రూ.209, రూ.249 ధరల రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను సైలెంటుగా ఎత్తేసింది. ఈ రెండూ ప్లాన్లలో 1GB రోజువారీ (Reliance Jio Recharge) డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, జియో యాప్‌లకు ఫ్రీగా యాక్సెస్ అందించేది. ఈ చీపెస్ట్ ప్లాన్లను ఒక్కసారిగా తొలగించడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు.
అయితే, రూ. 249 ప్లాన్ తొలగించింది. అంతకన్నా బెటర్ బెనిఫిట్స్ అందించే మరెన్నో రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా, జియో రూ.239 నుంచి ప్రారంభమయ్యే అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లను ఎంచుకోవచ్చు.
ఈ ప్లాన్లపై రోజుకు 1.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. చాలా వరకు అన్‌లిమిటెడ్ 5G డేటా, OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. తక్కువ వ్యాలిడిటీ, నెలవారీ బిల్లింగ్ లేదా ప్రీమియం స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. జియో అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లలో ఈ 5 ప్లాన్లను ఓసారి పరిశీలిద్దాం..
Reliance Jio Recharge : జియో రూ.239 ప్లాన్ :
ఈ రీఛార్జ్ ప్యాక్ 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. ఇందులో రెండు OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పూర్తి నెల పాటు కాకుండా బండిల్ స్ట్రీమింగ్ సర్వీసులను పొందేవారికి బెస్ట్ అని చెప్పొచ్చు.
జియో రూ.299 ప్లాన్ :
ఈ ప్లాన్ బడ్జెట్‌పై యూజర్ల కోసం రోజుకు 1.5GB చొప్పున 28 రోజుల పాటు రెండు OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ కోసం ఈ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.
జియో రూ.319 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ క్యాలెండర్-నెల వ్యాలిడిటీతో వస్తుంది. సాధారణ 28 రోజుల సైకిల్‌కు భిన్నంగా ఉంటుంది. ఆసక్తిగల వినియోగదారులు రోజుకు 1.5GB, అదనంగా రెండు OTT బెనిఫిట్స్ పొందవచ్చు. స్థిర నెలవారీ తేదీలలో రీఛార్జ్‌లను ఇష్టపడే వారికి బెస్ట్ అని చెప్పొచ్చు.
జియో రూ.329 ప్లాన్ :
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా అందిస్తుంది. స్టాండర్డ్ OTT యాప్స్‌తో పాటు జియోసావన్ ప్రో కూడా యాక్సస్ చేయొచ్చు.
జియో రూ.349 ప్లాన్ :
ఈ ప్లాన్ భారీగా డేటా వాడే యూజర్లకు బెస్ట్. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా పొందవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌కు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్, మరో రెండు OTT ప్లాట్‌ఫామ్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది. సరసమైన ధరలో ప్రీమియం కంటెంట్ యాక్సస్ చేయొచ్చు.