9K Gold Price : బాబోయ్ బంగారం వెరీ కాస్ట్‌లీ.. కానీ, ఈ 9K గోల్డ్ మాత్రం వెరీ చీప్.. పైగా ప్యూరిటీ.. ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే..!

9K Gold Price : బంగారం కొనలేమని ఆందోళనక్కర్లేదు.. ఖరీదైన బంగారం కొనలేనివారు.. ప్రభుత్వం ఆమోదించిన ఈ 9K ప్యూరిటీ గోల్డ్ కొనేసుకోవచ్చు..

9K Gold Price : బాబోయ్ బంగారం వెరీ కాస్ట్‌లీ.. కానీ, ఈ 9K గోల్డ్ మాత్రం వెరీ చీప్.. పైగా ప్యూరిటీ.. ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే..!

9K Gold Price

Updated On : August 22, 2025 / 3:53 PM IST

9K Gold Price : బంగారం కొనాలని ఉందా? ప్రస్తుత రోజుల్లో బంగారం కొనాలంటే కష్టమే. రోజురోజుకీ బంగారం మరింత ఖరీదైనదిగా మారిపోతుంది. సామాన్యులు (9K Gold Price) అత్యంత ఖరీదైన బంగారాన్ని కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించే పరిస్థితి కనిపించడం లేదు. తద్వారా బంగారు ఆభరణాలు అమ్మకాలు కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి.

సాధారణంగా పెళ్ళిళ్లు, పండుగల సమయంలో బంగారం అమ్మకాలు జోరుగా ఉంటాయి. ప్రతిఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. శుభకార్యాల్లోనూ బంగారం అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతేకాదు.. బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో సాధారణ వినియోగదారులకు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది.

9K Gold Price : 60శాతం తగ్గిన గోల్డ్ సేల్స్ :

వాస్తవానికి, గత జూన్‌లో భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం అమ్మకాలు దాదాపు 60శాతం తగ్గాయి. దీనిబట్టి చూస్తే.. బంగారం కొనేందుకు కొనుగోలుదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లను అందించేందుకు భారత ప్రభుత్వం ఇప్పుడు 9 క్యారెట్ల (9K) బంగారానికి హాల్‌మార్కింగ్‌ను ఆమోదించింది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వ్యవస్థ కింద అధికారికంగా గుర్తిస్తుంది.

హాల్‌మార్కింగ్ అనేది స్వచ్ఛతకు గుర్తు. హాల్‌మార్క్ ముద్ర ఉందంటే అది స్వచ్ఛమైనదిగా గుర్తించవచ్చు. ఇప్పటివరకు BIS 14K, 18K, 20K, 22K, 23K, 24K బంగారం వంటి స్వచ్ఛతలను గుర్తించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి 9K కూడా వచ్చి చేరింది. ఇకపై ఆభరణాల వ్యాపారులు ఇప్పుడు ఈ తక్కువ-స్వచ్ఛత 9K ఆభరణాలతో ప్రభుత్వ హామీతో విక్రయించవచ్చు.

9 క్యారెట్ల బంగారం ఎంత స్వచ్ఛమైనది? :
24K బంగారం అత్యంత స్వచ్ఛమైనది. ఇందులో 99.9 శాతం బంగారం ఉంటుంది. 9K బంగారంలో 37.5శాతం బంగారం మాత్రమే ఉంటుంది. మిగిలిన మొత్తం (62.5శాతం) రాగి, వెండి లేదా జింక్ వంటి ఇతర లోహాల మిశ్రమంతో వస్తుంది. 9K బంగారాన్ని చాలా తక్కువ ఖరీదుతో కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎక్కువకాలం మన్నికగా కూడా ఉంటుంది. ఎందుకంటే.. లోహాలు అధిక-క్యారెట్ ముక్కల కన్నా ఆభరణాలు వంగిపోకుండా ధృడంగా ఉండేలా చేస్తాయి.

Read Also : Best Budget Phones : కొత్త ఫోన్ కావాలా? మీ పేరెంట్స్ కోసం రూ. 15వేల లోపు 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

9K గోల్డ్ ఎందుకు కొనాలంటే? :

ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగింది. సామాన్యులు కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో సరసమైన ధరలో బంగారం కొనేందుకు ఇదే బెటర్ ఆప్షన్. 9K బంగారం సరసమైన ధరలో లభిస్తుంది.

మీ బడ్జెట్‌ ధరలోనే : ప్రస్తుత బంగారం ధరల ప్రకారం.. 24K బంగారం గ్రాముకు దాదాపు రూ. 10వేలు ఖర్చవుతుంది. అయితే, 9K బంగారం దాదాపు మూడింట ఒక వంతు ధరకు (గ్రాముకు దాదాపు రూ. 3,700) లభిస్తుంది.
రోజువారీగా ధరించవచ్చు : వాస్తవానికి ఈ 9K గోల్డ్ చాలా దృఢంగా ఉంటుంది. సులభంగా వంగదు అలాగే గీతలు కూడా పడదు. ఉంగరాలు, రోజువారీ ఆభరణాలకు చాలా బెస్ట్.
దొంగతనాల నుంచి సురక్షితం : ఇందులో బంగారం శాతం చాలా తక్కువగా ఉంటుంది. అధిక విలువ కలిగిన ఆభరణాలతో పోలిస్తే దొంగలు ఇలాంటి ఆభరణాలను దొంగిలించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటుంది.

హాల్‌మార్కింగ్ ఎందుకంటే? :
బంగారం కొనుగోలుదారులకు హాల్‌మార్కింగ్ అనేది చాలా ముఖ్యం. కొనుగోలు చేసే బంగారం అసలైనదా కాదా నిర్ధారించేందుకు ఈ హాల్ మార్కింగ్ ఉండాల్సిందే. ఇప్పుడు 9K బంగారం అధికారికంగా హాల్‌మార్కింగ్ సిస్టమ్‌లో చేరింది. అందుకే వినియోగదారులు మోసం లేదా నకిలీ స్వచ్ఛత వంటి గురించి ఆందోళన చెందకుండా చౌకైన ధరలోనే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.

మరోవైపు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో బంగారం అమ్మకాలు మళ్లీ ఊపందుకుంటాయని భావిస్తున్నారు. 22K, 24K గోల్డ్ కొనడం కష్టమే అంటున్న తరుణంలో సామాన్య కుటుంబాలు సైతం ఇప్పుడు 9K ఆభరణాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.