TRAI Spam Calls : 1600, 140 నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా? ఇక మోసపోవద్దు.. ట్రాయ్ క్లారిటీ ఇదే!

TRAI Spam Calls : మొబైల్ ఫోన్‌కు 1600 లేదా 140 సిరీస్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? చాలా మంది స్పామ్ కాల్స్‌గా భావించి లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఈ విషయంపై అపోహలను తొలగిస్తూ ట్రాయ్ (TRAI) కీలక వివరణ ఇచ్చింది.

TRAI Spam Calls

  • 1600 సిరీస్ నెంబర్లతో స్పామ్ కాల్స్
  • ఈ సిరీస్ ఫోన్ కాల్స్ నెంబర్లను బ్లాక్ చేయలేరు
  • 140 నెంబర్ల విషయంలో కన్ఫూజన్ వద్దంటున్న ట్రాయ్

TRAI Spam Calls : మీకు 1600, 140 సిరీస్ నెంబర్ల నుంచి పదేపదే కాల్స్ వస్తున్నాయా? అయితే, మోసపోవద్దు.. స్పామ్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ట్రాయ్ వినియోగదారులను హెచ్చరిస్తోంది.

అయితే, నియంత్రిత సంస్థలు, ప్రభుత్వ శాఖలు ప్రజలకు సేవలు, లావాదేవీలు, అధికారిక సమాచారాన్ని అందించేందుకు వాడే 1600 సిరీస్ ఫోన్ కాల్స్‌ను ఏ కాలర్ ఐడీ యాప్ కూడా బ్లాక్ చేయలేరని, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్ఫష్టం చేసింది.

ట్రూకాలర్‌తో వివాదం నేపథ్యంలో ట్రాయ్ ఈ క్లారిటీ ఇచ్చింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) ప్రకారం.. 1600 సిరీస్ నంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు వంటి నియంత్రిత సంస్థలకు కేటాయించారు. ఈ సిరీస్ నెంబర్ల ద్వారా వినియోగదారులకు లావాదేవీలు, సేవలకు సంబంధించిన కీలక సమాచారం అందిస్తారని తెలిపింది

Read Also : Apple iPhone Air Price : వావ్.. ఐఫోన్ ఎయిర్ ఇంత తక్కువ ధరకా? ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

అదేవిధంగా, 140 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్‌ను కూడా యాప్‌లు నేరుగా బ్లాక్ చేయలేవని ట్రాయ్ వెల్లడించింది. అయితే, ఈ కాల్స్‌ను రాకుండా ఆపాలంటే మాత్రం వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను డూ నాట్ డిస్టర్బ్ (DND) రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. అప్పుడు మాత్రమే ఈ సిరీస్ నెంబర్లను కూడా టెలికాం ఆపరేటర్ల ద్వారా బ్లాక్ చేయొచ్చునని సూచించింది.

మరోవైపు.. ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం 140, 1600 సిరీస్ నంబర్ల నుంచే పెద్దఎత్తున స్పామ్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ప్రతిరోజూ ఈ రెండు సిరీస్‌ల నుంచి వచ్చే 5.1 కోట్లకు పైగా కాల్స్‌ వస్తున్నా వినియోగదారులు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు.

ముఖ్యంగా 1600 సిరీస్ కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తద్వారా అధికారిక కాల్స్, స్పామ్ కాల్స్ మధ్య తేడాను గుర్తించి వినియోగదారులు అలర్ట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.2025 అక్టోబర్ నుంచి 208 శాతం బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.