×
Ad

Laptop Sale Offers : కొత్త ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ల్యాప్‌టాప్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

Laptop Sale Offers : కొత్త ల్యాప్ టాప్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. అమెజాన్ సేల్‌లో రూ. 46,990 ప్రారంభ ధరతో మీకు నచ్చిన ల్యాప్‌టాప్స్ కొనేసుకోవచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Laptop Sale Offers

  • ఇంటెల్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డీల్స్
  • అమెజాన్‌లో ప్రారంభ ధర రూ. 46,990కే కొత్త ల్యాప్‌టాప్
  • పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, స్టోరేజీ, లాంగ్ బ్యాటరీలు

Laptop Sale Offers : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? మల్టీ టాస్కింగ్‌, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ అందించే ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. విద్యార్థులు, వర్కింగ్ ఎంప్లాయ్, కంటెంట్ క్రియేటర్ల కోసం అద్భుతమైన ల్యాప్ టాప్ అందుబాటులో ఉన్నాయి.

హై పర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్‌ కోసం చూస్తుంటే ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు. ఈ ల్యాప్‌టాప్‌లలో హెచ్‌పీ, లెనోవో, ఏసర్, అసూస్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ఇందులో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, తగినంత స్టోరేజీ, లాంగ్ ఉండే బ్యాటరీలు ఉన్నాయి. డిస్‌ప్లే కూడా ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌ల జాబితాను ఓసారి లుక్కేయండి..

హెచ్‌పీ 15 i5 ల్యాప్‌టాప్ :
HP ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో బాగా పాపులర్. మీరు పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే అద్భుతమైన ఆప్షన్. ఈ టాప్-బ్రాండ్ ల్యాప్‌టాప్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో వస్తుంది. చాలా పవర్‌ఫుల్. తగినంత స్టోరేజీని కూడా అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్. ఈ HP ల్యాప్‌టాప్ ధర రూ. 55,990 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Bharat Taxi App : ఓలా, ఉబర్‌తో పనిలేదు.. కొత్త ‘భారత్ టాక్సీ’ యాప్ వచ్చేసింది.. రైడ్ బుకింగ్ చాలా ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

లెనోవా థింక్‌బుక్ ల్యాప్‌టాప్ :
ఈ లెనోవా ల్యాప్‌టాప్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను ఇప్పుడు రూ. 46,990కు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా ఎక్స్ పర్ట్స్, మల్టీ టాస్కర్ల కోసం రూపొందించగా డివైజ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది.

అసూస్ వివోబుక్ అల్ట్రా 7 ల్యాప్‌టాప్ :
మీరు ప్రీమియం ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే అసూస్ వివోబుక్ అల్ట్రా 7 అద్భుతమైన ఆప్షన్. అదిరిపోయే డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అల్ట్రా 7 ప్రాసెసర్‌ కూడా ఉంది. భారీ 16-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 144Hz ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. గేమర్‌లకు కూడా బెస్ట్ ల్యాప్‌టాప్. ధర విషయానికి వస్తే.. ఈ అసూస్ ల్యాప్‌టాప్ రూ. 111,990కు బదులుగా కేవలం రూ. 88,990కే లభిస్తుంది.

ఏసర్ ఆస్పైర్ గో 14 ల్యాప్‌టాప్ :
ఈ ఏసర్ ల్యాప్‌టాప్ మీకు అద్భుతమైన ఆప్షన్. ఏఐ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 125 ఏఐ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ బడ్జెట్ కేటగిరీలో కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ అని చెప్పొచ్చు. రూ. 60వేల కన్నా తక్కువ ధరలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది.