×
Ad

Truecaller Family Subscription : భారత్‌లో రూ. 132లకే ట్రూకాలర్ కొత్త ఫ్యామిలీ సబ్‌స్ర్కిప్షన్.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం..!

Truecaller Family Subscription : ప్రముఖ ఫోన్ కాలర్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కొత్త 'Family Plan'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గరిష్టంగా 5 మంది వరకు ఈ ప్లాన్ షేరింగ్ చేసుకోవచ్చు. కొత్త ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తోందని కంపెనీ చెబుతోంది.

Truecaller launches new Family subscription for Rs 132 in India_ Check benefits

Truecaller Family Subscription : ప్రముఖ ఫోన్ కాలర్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కొత్త ‘Family Plan’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గరిష్టంగా 5 మంది వరకు ఈ ప్లాన్ షేరింగ్ చేసుకోవచ్చు. కొత్త ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తోందని కంపెనీ చెబుతోంది. అయితే, ప్రాథమిక సభ్యుడు ఐఫోన్‌తో ట్రూకాలర్ వినియోగదారుని యాడ్ చేయవచ్చు. కొత్త టైర్ ప్రీమియం (నెలకు రూ. 39 లేదా సంవత్సరానికి రూ. 399), ప్రీమియం కనెక్ట్ (నెలకు రూ. 75 లేదా సంవత్సరానికి రూ. 529) వంటి ప్రస్తుత పర్సనల్ ప్లాన్‌లతో పాటుగా అందుబాటులో ఉంది.

ఇప్పటికే ఉన్న ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు కొత్త సభ్యులను యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీని ధర నెలకు రూ. 132 (లేదా ఏడాదికి రూ. 925) వరకు ఉంటుంది. ఫీచర్ల పరంగా చూస్తే.. Truecaller ప్రీమియం కనెక్ట్ ప్లాన్‌లు అడ్వాన్స్ స్పామ్-బ్లాకింగ్, Truecaller ప్రొఫైల్‌ను ఎవరు చూశారో చూశారు, ​​ప్రీమియం బ్యాడ్జ్, యాడ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ వంటి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ కింద ట్రూకాలర్ సభ్యులు మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

Apple One లేదా Spotify ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ల మాదిరిగానే ఈ ప్లాన్‌లోని సబ్‌స్క్రైబర్‌లు ఒకరికొకరు డేటా లేదా పర్సనల్ డేటాను షేర్ చేసుకోలేరని Trucaller కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి, ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ అమెరికాలో మినహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ట్రూకాలర్ సబ్‌స్క్రిప్షన్‌ను మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. ట్రూకాలర్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్ గురించి ఇండియా డివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా మాట్లాడుతూ.. ప్రీమియం యూజర్లకు మరింత సరసమైన సబ్‌స్క్రిప్షన్‌లను అందించనున్నట్టు తెలిపారు.

Truecaller launches new Family subscription for Rs 132 in India_ Check benefits

Read Also :  Truecaller : గూగుల్ కొత్త రూల్.. కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించిన ట్రూకాలర్ యాప్..!

సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. వినియోగదారులు తమ ప్రియమైన వారికి Truecaller ప్రీమియం సబ్ స్ర్కిప్షన్  కింద తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ నిర్వాహకుడిగా మీరు మీ ప్లాన్‌కి నలుగురిని యాడ్ చేయవచ్చు. ట్రూకాలర్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ (సంవత్సరానికి రూ. 4,999) కోసం ఎలాంటి ఫ్యామిలీ ప్లాన్ లేదని ట్రూకాలర్ ధృవీకరించింది.

మరోవైపు.. ట్రూకలర్ కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ట్రూకాలర్‌లో ధృవీకరించిన ప్రభుత్వ అధికారులు లేదా సర్వీసుల సంఖ్యలతో యాప్‌కి డిజిటల్ డైరెక్టరీ (Digital Directory)ని యాడ్ చేసింది. ప్రభుత్వం, అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి నేరుగా సమాచారం పొందినట్లు కంపెనీ పేర్కొంది. గుర్తు తెలియని నంబర్‌లను గుర్తించడం కోసం చాలామంది (Truecaller)ని వినియోగిస్తుంటారు. తమకు వచ్చిన ఫోన్ కాల్స్ స్పామ్ అవునో కాదో గుర్తించేందుకు వీలుంది.

అదేవిధంగా, ట్రూకాలర్ యాప్ ద్వారా ధృవీకరించిన ప్రభుత్వ అకౌంట్లను చాలా సులభంగా గుర్తించవచ్చు. ట్రూకాలర్ యాప్ ఇప్పుడు గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్, బ్లూ టిక్‌ను చూపిస్తుంది. అప్పుడు ఆ నంబర్ వెరిఫై చేసినదిగా గుర్తించవచ్చు. అది స్కామ్ కాదని మీకు తెలియజేసేందుకు ట్రూకాలర్ యూజర్లకు ఇచ్చే సంకేతంగా చెప్పవచ్చు. తద్వారా స్పామ్ మోసాలను తగ్గించడంలో ఈ ఫీచర్ సాయపడుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Truecaller New Features : ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇకపై వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను చూడొచ్చు.. ఎలా చెక్ చేయాలో తెలుసా?