Samsung Galaxy A57 : ఖతర్నాక్ ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5G ఫోన్ వస్తోందోచ్.. ఈ గెలాక్సీ A57 ధర ఎంత ఉండొచ్చంటే?
Samsung Galaxy A57 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ రాబోతుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy A57 (Image Credit To Original Source)
- ఎక్స్ క్లిప్స్ 550 జీపీయూ, శాంసంగ్ ఎక్సినోస్ 1680 చిప్‌సెట్
- రూ.50వేల బడ్జెట్ లోపు ధర ఉండొచ్చు
- ఫిబ్రవరి లేదా మార్చి 2026 ప్రారంభంలో లాంచ్
- బేస్ వేరియంట్ ధర రూ. 41,999, హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 47,999
Samsung Galaxy A57 : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో కొత్త శాంసంగ్ గెలాక్సీ A57 5G ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవలే ఇండియన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), చైనా TENAA సర్టిఫికేషన్ లిస్టింగ్‌లలో ఈ ఫోన్ కనిపించింది. ఈ రెండు దేశాలలో త్వరలోనే శాంసంగ్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది.
వాస్తవానికి, ఈ శాంసంగ్ ఫోన్ ఎక్స్ క్లిప్స్ 550 జీపీయూతో శాంసంగ్ ఎక్సినోస్ 1680 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు. 50MP మెయిన్ సెన్సార్ కూడా ఉండొచ్చు. 5,000mAh భారీ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఫీచర్లు, ధరకు సంబంధించి అన్ని అంచనా వివరాలు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..
ధర, లాంచ్ టైమ్ :
శాంసంగ్ గెలాక్సీ A57 ఫోన్ రూ.50వేల బడ్జెట్ లోపు లాంచ్ అవుతుందని అంచనా. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 41,999 నుంచి ఉంటుంది. హై-ఎండ్ వేరియంట్లకు రూ. 47,999 వరకు ధర ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ శాంసంగ్ ఫోన్ ఫిబ్రవరి లేదా మార్చి 2026 ప్రారంభంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కూడా ఇదే సమయంలో లాంచ్ ఉండొచ్చు.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
శాంసంగ్ గెలాక్సీ A57 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ కూడా ఉంది. OISతో సోనీ IMX906, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్ ఉండవచ్చు. అయితే, ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 5,000mAh సాధారణ బ్యాటరీతో వస్తుందని అంచనా. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు.
డిస్‌ప్లే, డిజైన్ :
ఇటీవలి లీక్‌ల ప్రకారం.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాలు, 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1,900 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్ అందించే అవకాశం ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఏ కాంతిలోనైనా ఆపరేట్ చేయొచ్చు. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌తో వస్తుందని అంచనా. కచ్చితమైన కలర్ ఆప్షన్లు, కాంట్రాస్ట్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ ఎక్స్ క్లిప్స్ 550 జీపీయూతో శాంసంగ్ సొంత ఎక్సినోస్ 1680 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని పుకార్లు ఉన్నాయి. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB లేదా 12GB ర్యామ్ వేరియంట్లలో 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు.
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16లో శాంసంగ్ వన్ యూఐ 8 ఇంటర్‌ఫేస్‌తో రన్ అయ్యే అవకాశం ఉంది. ఇతర శాంసంగ్ ఫోన్ల మాదిరిగానే లాంగ్ సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ అందుకోవచ్చు.
