House Rent Cash : మీ ఇంటి అద్దెను క్యాష్ రూపంలో చెల్లిస్తారా? ఏ క్షణమైనా నోటీసులు రావొచ్చు? మీరు ఐటీ నిఘాలోకి ఎలా వస్తారంటే?

House Rent Cash : మీ ఇంటి అద్దెను కూడా నగదు రూపంలో చెల్లిస్తారా? సాధారణంగా ఇంటి యజమానులు క్యాష్ పేమెంట్లనే ఎక్కువగా డిమాండ్ చేస్తారు. మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఎప్పుడైనా రావొచ్చు.. మీరు ఏం చేయాలంటే?

House Rent Cash : మీ ఇంటి అద్దెను క్యాష్ రూపంలో చెల్లిస్తారా? ఏ క్షణమైనా నోటీసులు రావొచ్చు? మీరు ఐటీ నిఘాలోకి ఎలా వస్తారంటే?

Pay House Rent in Cash (Image Credit : AI )

Updated On : January 24, 2026 / 7:53 PM IST

House Rent Cash : మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? మీరు ప్రతినెలా అద్దెను క్యాష్ రూపంలో చెల్లిస్తారా? అలా అయితే మీకో షాకింగ్ న్యూస్.. మీరు ఇన్ కమ్ టాక్స్ రాడర్‌లో ఉన్నట్టే.. మీకు ఏ క్షణమైనా ఐటీ నోటీసులు రావొచ్చు.

చాలామంది టాక్స్ పేయర్లకు ఐటీ రూల్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. అందుకే మీరు ఆదాయపు పన్ను శాఖ రూల్స్ గురించి తప్పక తెలిసి ఉండాలి. ఐటీఆర్ ఫైలింగ్ చేయకముందే ఈ హౌస్ రెంట్ పేమెంట్లకు సంబంధించి అన్ని రసీదులను రెడీ చేసుకోండి.

ఒకవేళ మీరు క్యాష్ ద్వారా హౌస్ రెంట్ చెల్లించి ఉంటే దానికి సంబంధించి అన్ని డాక్యమెంట్లు వివరాలు దగ్గర ఉండాలి. మీరు అద్దెను నగదు రూపంలో చెల్లించారని ఐటీశాఖకు నిరూపించుకోవాలి. మీ ఖర్చులు, ఆదాయం సరిపోలని సందర్భాల్లో మాత్రమే ఐటీ శాఖ మీకు నోటీసులు పంపే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇంటి అద్దె ఎలా చెల్లించాలి? :

రికార్డుల కోసం మీరు అద్దె చెల్లించారని ఆదాయ పన్ను శాఖకు తెలియాలంటే చెక్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా అద్దె చెల్లించాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. మీరు క్యాష్ రూపంలో అద్దె చెల్లిస్తే ఎలాంటి రికార్డులు మీ దగ్గర ఉండవు. మీ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. మీరు చెల్లించే అద్దె మొత్తం పెద్దగా ఉంటే.. ఈ వ్యత్యాసం భారీగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏ క్షణమైనా మీరు నోటీసులు అందుకోవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందితే ఏం చేయాలి? :
మీరు అద్దెను క్యాష్ రూపంలో చెల్లించి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు అందుకుంటే.. మీరు అద్దెను క్యాష్ రూపంలో చెల్లించారనేందుకు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు. అందుకే ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాలను సరిచూసుకోవాలి.

Read Also : Union Budget 2026 : భార్యాభర్తలిద్దరూ ఒకే ITR ఫైల్ చేస్తే ఎక్కువ పన్ను ఆదా అవుతుందా? బడ్జెట్‌లో ‘జాయింట్ టాక్స్’ బెనిఫిట్స్ ఏంటి?

1. ఫస్ట్ మీ దగ్గర రెంట్ అగ్రిమెంట్ తప్పక ఉండాలి. అద్దెతో పాటు ఇతర ముఖ్యమైన షరతులు ఉంటాయి. ఆదాయపు పన్ను శాఖ ఈ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఎప్పుడైనా అడగొచ్చు.

2. మీ ఇంటి అద్దె రూ. 50వేలు దాటితే, TDS తగ్గించాక అద్దె చెల్లించడం మీ బాధ్యతగా గుర్తుంచుకోవాలి.

3. మీరు ఇంటి యజమాని, అద్దెదారు గురించి సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. దీనికి ఆధార్, పాన్ కార్డులు అవసరం.

4. అద్దె రసీదు కూడా చాలా ముఖ్యం. మీరు అద్దె చెల్లించినప్పుడల్లా ఇంటి యజమాని నుంచి రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇంటి అద్దె భత్యం పొందాలనుకుంటే మీకు అద్దె రసీదు కూడా తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.

5. మీ ఇంటి అద్దె రూ. 10 లక్షలు దాటితే.. మీరు మీ ఇంటి యజమాని పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. తప్పు పాన్ సమాచారం ఇస్తే మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తాయి జాగ్రత్త..