Apple iPhone 17e : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17e వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Apple iPhone 17e : ఆపిల్ 2026 ప్రారంభంలో ఐఫోన్ 17e లాంచ్ చేయనుంది. ప్రాసెసింగ్ స్పీడ్, కెమెరా సామర్థ్యాలలో ఐఫోన్ 16e కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లను అందించనుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Apple iPhone 17e
- 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం
- అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ లాంచ్
- రూ. 64,900 ధరకు భారత మార్కెట్లో రిలీజ్ కావొచ్చు
- మార్చి 7, 2026 నాటికి భారత మార్కెట్లోకి
Apple iPhone 17e Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రపంచ మార్కెట్లోకి అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ వంటి కొన్ని బెస్ట్ ఐఫోన్లు ఇటీవలే లాంచ్ అయ్యాయి.
2026లో కుపెర్టినో ఆధారిత దిగ్గజం మొదటి త్రైమాసికంలో ఐఫోన్ 17e మోడల్ కూడా లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. రాబోయే ఐఫోన్ మోడల్ ప్రాసెసింగ్ స్పీడ్, కెమెరా సిస్టమ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. గత ఐఫోన్ 16eతో పోలిస్తే ఈ ఐఫోన్ మరిన్ని ఫీచర్లతో రానుంది. అలాగే సింగల్ రియర్ సెన్సార్ కూడా ఉంటుంది.
ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లు , డిజైన్, కెమెరాలు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ 6.1-అంగుళాల ప్రోమోషన్ OLED డిస్‌ప్లే, స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆపిల్ A19 ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌లో రావొచ్చు.
ఈ సిరీస్‌లోని అన్ని ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఈ ఐఫోన్ కూడా కనీసం 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావొచ్చునని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4005mAh బ్యాటరీ ద్వారా పవర్ అందిస్తుంది.
డిజైన్ పరంగా పరిశీలిస్తే..
ఆపిల్ ఐఫోన్ 17e గత ఐఫోన్ మాదిరిగా ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. అయితే, రాబోయే ఐఫోన్‌లో కొన్ని చిన్న మార్పులు ఉండవచ్చు. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP సెంటర్ స్టేజ్ సెన్సార్‌తో రావొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఐఫోన్ 17 సిరీస్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే ఈ ఐఫోన్ 18MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు.
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 17e ధర, లాంచ్ తేదీ :
ప్రస్తుతానికి, దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, అధికారిక ధరలకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ఐఫోన్ మోడల్ మార్చి 7, 2026 నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ రూ. 64,900 ధరకు భారత మార్కెట్లో రిలీజ్ కావొచ్చు. ఐఫోన్ 16e లాంచ్ ధర కన్నా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు.
