Mahindra Thar Roxx Star : థార్ లవర్స్‌కు పండగే.. 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మహీంద్రా రాక్స్ స్టార్ ఎడిషన్ ఆగయా.. ధర చూస్తే నమ్మరు!
Mahindra Thar Roxx Star : మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ EDN మోడల్ లాంచ్ అయింది. ఈ థార్ రాక్స్ స్టార్ మోడల్ ధర రూ. 16.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫుల్ ఫీచర్ల వివరాలివే..
Mahindra Thar Roxx Star (Image Credit To Original Source)
- మహీంద్రా కొత్త థార్ ROXX స్టార్ ఎడిషన్ లాంచ్
- ప్రారంభ ధర రూ. 16.85 లక్షల నుంచి
- మొత్తం 3 వేరియంట్లలో థార్ రాక్స్ స్టార్ ఎడిషన్
- లుక్ రఫ్.. సేఫ్టీ టఫ్.. కొత్త థార్ రాక్స్ స్టార్ ఎడిషన్
Mahindra Thar Roxx Star : మహీంద్రా థార్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. భారత మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి అత్యంత పాపులర్ అయిన SUVలో సరికొత్త థార్ రాక్స్ స్టార్ ఈడీఎన్ వచ్చేసింది. ఈ థార్ రాక్ స్టార్ ఎడిషన్ అనేక స్పెషల్ ఫీచర్లతో పాటు అద్భుతమైన లుక్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ఎస్‌యూవీ కార్లలో అత్యుత్తమ స్టైలింగ్ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ కొత్త ఎడిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ రేంజ్‌లో కొత్త స్పెషల్ మోడల్ థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌ను రూ. 16.85 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఈ కారు లగ్జరీ ఫీచర్లను కోరుకునే వారికి పర్‌ఫెక్ట్.. ఈ కొత్త ఎడిషన్‌లో మహీంద్రా పాపులర్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో పాటు బయట, లోపల అదిరిపోయే డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.
3 వేరియంట్లు, కొత్త కలర్ ఆప్షన్లలో :
కొత్త మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ RWD వేరియంట్ ధర రూ. 16.85 లక్షలు, పెట్రోల్ ఆటోమేటిక్ RWD వేరియంట్ ధర రూ. 17.85 లక్షలు, డీజిల్ మాన్యువల్ RWD వేరియంట్ ధర రూ. 18.35 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే..

Mahindra Thar Roxx Star (Image Credit To Original Source)
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ కొత్త కలర్ ఆప్షన్, సిట్రిన్ ఎల్లోలో కూడా వస్తుంది. దాంతో ఈ థార్ రాక్స్ స్టార్ స్పోర్టీవ్ ఫీచర్లతో వస్తుంది. ఎస్‌యూవీ టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్ స్టీల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా వస్తుంది.
Read Also : Samsung Galaxy S25 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది భయ్యా.. రూ.83వేల శాంసంగ్ 5జీ ఫోన్ జస్ట్ రూ. 41వేలకే, ఎలాగంటే?
ఈ కారులో స్పెషాలిటీ ఏంటి? :
కొత్త మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ క్యాబిన్ ప్రీమియం లుక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, ఆల్-బ్లాక్ లెథరెట్ సీట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సీట్ల డీప్ బ్లాక్ కలర్ క్యాబిన్ మరింత ఆకట్టుకునేలా ఉంది. థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ ఫ్రంట్ సైడ్ పియానో బ్లాక్ గ్రిల్ పవర్‌ఫుల్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఐడెంటిటీతో అల్లాయ్ వీల్స్ కూడా పియానో బ్లాక్‌లో ఉన్నాయి.

Mahindra Thar Roxx Star (Image Credit To Original Source)
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఫుల్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌లో ఫుల్ బ్లాక్ లెథరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్ ORVMs, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయ.
అలాగే, భారీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్రినాక్స్ కనెక్ట్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా, 9 స్పీకర్లతో కస్టమ్-ట్యూన్ హర్మాన్ కార్డాన్ క్వాంటం లాజిక్ ప్రీమియం ఆడియో సిస్టమ్, అప్రోచ్ అన్‌లాక్ వాక్-అవే లాక్, 5-స్టార్ భారత్ NCAP రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇ-కాల్ SOS అనేక ఇతర ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
