Upcoming Smartphones : మేలో 6 కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. వన్‌ప్లస్ నుంచి వివో వరకు.. మీ ఫేవరెంట్ ఫోన్ ఏంటి?

Upcoming Smartphones : వన్‌ప్లస్, ఒప్పో, వివో, హెచ్‌ఎమ్‌డీ కంపెనీలకు చెందిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు 2026 మే నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. మీ ఫేవరెట్ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.

Upcoming Smartphones

  • మే నెలలో వన్‌ప్లస్, ఒప్పో, వివో ఫోన్‌లు లాంచ్ కానున్నాయి
  • 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా వంటి భారీ అప్‌గ్రేడ్‌లు
  • ఆండ్రాయిడ్ 16, సరికొత్త చిప్‌సెట్‌తో కూడిన కొత్త ఫోన్లు

Upcoming Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మే 2026లో బడ్జెట్, మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ అనే 3 కేటగిరీలో కొత్త ఫోన్లు రానున్నాయి. కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. వన్‌ప్లస్, ఒప్పో, వివో, హెచ్‌ఎమ్‌డీ వంటి బ్రాండ్‌లు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఈసారి, కేవలం డిజైన్ లేదా కెమెరాపైనే దృష్టి లేదు.

భారీ బ్యాటరీలు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, సరికొత్త ప్రాసెసర్‌ల వంటి (Upcoming Smartphones) అప్‌గ్రేడ్‌లు కూడా కనిపించనున్నాయి. చాలా ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 తో పాటు లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా అందిస్తాయని అంచనా. మొత్తంమీద, మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మే నెలలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు.

భారత మార్కెట్లో మే 2026లో రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు :

వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 లైట్ :
భారత మార్కెట్లో మే 7న వన్‌ప్లస్ నార్డ్ సీఇ 6 లైట్ లాంచ్ కానుంది. కంపెనీ ప్రకారం.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్‌సెట్‌తో వస్తుంది. రూ. 20వేల నుంచి రూ. 25వేల కేటగిరీలో రానుంది. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా ఉంటాయని అంచనా. ఈ ఫోన్ 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16తో వస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Vivo X Fold 5 : వివో ఫోల్డబుల్ ఫోన్ భలే ఉందిగా.. ఇలా కొన్నారంటే రూ. 28,400 ఆదా.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!

HMD వైబ్ 2 5జీ :
వచ్చే మే నెలలో భారత మార్కెట్లో HMD వైబ్ 2 5జీ ఫోన్ లాంచ్ కానుంది. అయితే, కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. డిజైన్ పరంగా, ఫ్లాట్ డిస్‌ప్లే, సెంటర్ హోల్-పంచ్ కటౌట్‌ ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఎంట్రీ-లెవల్ 5జీ సెగ్మెంట్‌లో గత మోడల్ HMD వైబ్ 5Gకి నెక్ట్స్ మోడల్ గా రానుంది.

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా :
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా కూడా ఈ నెలలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రానుంది. ఇందులో 6.82-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 7,050mAh బ్యాటరీ కూడా ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఒప్పో ఫైండ్ X9ఎస్ :
ప్రీమియం మిడ్-రేంజ్ కేటగిరీ ఒప్పో ఫైండ్ X9sతో పాటుగా ఫైండ్ X9 అల్ట్రా కూడా లాంచ్ కానుంది. ఇందులో డైమెన్సిటీ 9500s ప్రాసెసర్, 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కెమెరా సెటప్‌లో మూడు 50MP సెన్సార్లు ఉన్నాయి. 7,025mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

వివో X300 అల్ట్రా :
వివో ఈ నెలలో ఫ్లాగ్‌షిప్ లైనప్‌ కూడా లాంచ్ చేయనుంది. వివో X300 అల్ట్రా మే మొదటి వారంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200MP కెమెరా, 6,600mAh బ్యాటరీ ఉన్నాయి. ముఖ్యంగా, జూమ్ పర్ఫార్మెన్స్ ఔట్ ఫొటోగ్రఫీ లెన్స్ ఆప్షన్ కూడా అందిస్తుంది.

వివో X300 ఎఫ్ఈ :
కాంపాక్ట్ పవర్‌ఫుల్ ఫోన్ వివో X300 అల్ట్రాతో పాటు, వివో X300 ఎఫ్ఈ కూడా అదే ఈవెంట్‌లో లాంచ్ కానుంది. ఇందులో 6.31-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ ఉన్నాయి. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే, ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.