Vivo X Fold 5 : వివో ఫోల్డబుల్ ఫోన్ భలే ఉందిగా.. ఇలా కొన్నారంటే రూ. 28,400 ఆదా.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
Vivo X Fold 5 : వివో పవర్ ఫుల్ ఫోల్డబుల్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ మళ్లీ రాదు. ఎలా సొంతం చేసుకోవాలంటే?
Vivo X Fold 5
- వివో ఎక్స్ ఫోల్డ్ 5లో 8.03 అంగుళాల అమోల్డ్ ఇంటర్నల్ డిస్ప్లే
- 6,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్
- బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో భారీగా ఆదా
Vivo X Fold 5 : వివో లవర్స్ కోసం దిమ్మతిరిగే ఆఫర్.. వివో పవర్ ఫుల్ ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు కొత్త వివో ఫోల్డబుల్ ఫోన్‌ను కొనాలని అనుకుంటే ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో వివో ఎక్స్ ఫోల్డ్ 5 పై బ్యాంక్ (Vivo X Fold 5) ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో సగానికి పైగా ఆదా చేయొచ్చు. వివో ఎక్స్ ఫోల్డ్ 5పై డీల్స్, ఆఫర్లను వివరంగా పరిశీలిద్దాం..
వివో ఎక్స్ ఫోల్డ్ 5 ధర, ఆఫర్లు :
వివో ఎక్స్ ఫోల్డ్ 5 మోడల్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ. 16వేల తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్లు లభిస్తున్నాయి. తద్వారా ధర రూ. 1,33,999కి చేరుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 28,400 ఆదా చేసుకోవచ్చు.
వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు :
వివో ఎక్స్ ఫోల్డ్ 5లో 2480×2200 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్నెస్ 8.03-అంగుళాల అమోల్డ్ ఇంటర్నల్ డిస్ప్లే ఉంది. 2748×1172 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ 6.53-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్ప్లే కూడా ఉంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 5లో అడ్రినో 750 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-సీ పోర్ట్ 3.2, జీపీఎస్, ఓటీజీ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
వివో ఎక్స్ ఫోల్డ్ 5 బ్యాక్ సైడ్ ఎఫ్/1.57 అపర్చర్ సపోర్ట్‌తో 50MP ఎఎఫ్ IMX921 ఓఐఎస్, వీసీఎస్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.05 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ ఎఎఫ్ JN1 కెమెరా, ఎఫ్/2.55 అపర్చర్‌తో 50MP ఎఎఫ్ IMX882 OIS టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 20MP ఫస్ట్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 20MP రెండో ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.
