×
Ad

Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే కోసం రూ. 20వేల లోపు టాప్ 6 స్మార్ట్‌ఫోన్లు.. మీకు ఇష్టమైనవారికి ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారంటే?

Valentine's Day 2026 : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి రూ. 20వేల లోపు ధరలో ఏదైనా ఒక ఫోన్ కొని గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయొచ్చు.. ఏ ఫోన్ కొంటారంటే?

  • Published On : February 14, 2026 / 03:15 PM IST

Valentine's Day 2026

  • రూ. 20వేల లోపు ధరలో రూ. 6 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు
  • మీ ప్రియమైనవారికి ఈ ఫోన్లలో ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు
  • ఒప్పో కె14ఎక్స్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ వరకు

Valentine’s Day 2026 : వాలెంటైన్స్ డే రోజున కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఏ ఫోన్ కొనాలో తెలియడం లేదా? మీ ప్రియమైనవారికి ఎలాంటి ఫోన్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసం ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

మంచి ప్రాసెసర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే 6 అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. రూ. 20వేల లోపు ధరలో కొన్ని టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీరు ఏ ఫోన్ కావాలో కొనేసుకోండి.

ఒప్పో K14x :
ఒప్పో K14x ఫోన్ 6.75-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ అందిస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 1125 నిట్స్, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ColorOS15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 50MP రియర్ కెమెరాతో పాటు 5MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. 45W ఛార్జర్, 6500 mAh బ్యాటరీతో వస్తుంది.

రియల్‌మి P4x :
ఈ రియల్‌మి ఫోన్ రియల్‌మి యూఐ 6.0తో రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 అల్ట్రా సీపీయూ ద్వారా పవర్ పొందుతుంది. డ్యూయల్ 50MP రియర్ కెమెరాతో పాటు 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. 144Hz వద్ద రిఫ్రెష్ అయ్యే 6.72-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ అందిస్తుంది.

Read Also : Valentine Day 2026 : వాలెంటైన్స్ డే ఆఫర్.. రోజుకు జస్ట్ రూ.30 EMIతో.. పండుగ చేసుకోండి..

నథింగ్ ఫోన్ 2 ప్రో :
నథింగ్ ఫోన్ 2 ప్రోలో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. 8MP అల్ట్రావైడ్, 50MP కెమెరా, 50MP టెలిఫోటో ఉన్నాయి. 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ అందిస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 1B కలర్ ఆప్షన్లు, 33W ఛార్జర్, 5000mAh బ్యాటరీతో వస్తుంది.

వివో T4x :
వివో T4x ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ ఫన్‌టచ్ 15పై రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6500mAh బ్యాటరీ, 44W ఛార్జర్ అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ F17 ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ F17లో 50MP + 5MP + 2MP ట్రిపుల్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. అలాగే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌ అందిస్తుంది.

మోటోరోలా G67 పవర్ :
ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 7000mAh బ్యాటరీతో వస్తుంది. 50MP + 8MP డ్యూయల్ కెమెరాతో 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 1050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది.