Valentine Day 2026 : వాలెంటైన్స్ డే ఆఫర్.. రోజుకు జస్ట్ రూ.30 EMIతో.. పండుగ చేసుకోండి..
Samsung Galaxy A07 5G : వాలెంటైన్స్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో ఇలా కొనేసుకోండి.

Samsung Galaxy A07 5G : వాలెంటైన్స్ డే సందర్భంగా శాంసంగ్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్. శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 50MP డ్యూయల్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, భారీ 6000mAh బ్యాటరీతో లభిస్తోంది.

శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధర రేంజ్లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి బెస్ట్ ఫోన్. అలాగే, హై-క్వాలిటీతో ఫొటోగ్రఫీ కోసం 50MP డ్యూయల్ బ్యాక్ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ డిస్కౌంట్ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ A07 5Gపై అద్భుతమైన డిస్కౌంట్ : శాంసంగ్ గెలాక్సీ A07 5జీ మోడల్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీ అసలు ధర రూ. 15,999 ఉండగా, లైట్ వయొలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ కంపెనీ వెబ్సైట్లో నెలకు రూ. 900 వరకు (రోజుకు రూ. 30) ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ శాంసంగ్ ఫోన్ కొనేందుకు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A07 5G ఫీచర్లు : ఈ శాంసంగ్ ఫోన్లో 6.72-అంగుళాల FHD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్‌తో పాటు ఈ ఫోన్ పవర్ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 (4nm) సీపీయూతో మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా ఉంటుంది.

మెమరీ, స్టోరేజీ ఆప్షన్లలో 128GB వరకు స్టోరేజీ అందిస్తుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. ర్యామ్ విషయానికి వస్తే 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ కూడా అందిస్తుంది.

కెమెరా సెటప్ 50MP ప్రైమరీ సెన్సార్, సెకండరీ కెమెరాతో హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అలాగే, ఈ శాంసంగ్ ఫోన్లో 5G, Wi-Fi, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ శాంసంగ్ ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
