Vi vs BSNL Plans : రూ.435కే Vi.. రూ.485కి BSNL.. డేటా, కాలింగ్‌లో ఏ ప్లాన్ బెస్ట్? బెనిఫిట్స్ ఎందులో ఎక్కువంటే?
Vi vs BSNL Plans : వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ప్లాన్? ఎందులో బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 26, 2026 / 06:13 PM IST
Vi vs BSNL Plans
- BSNL రోజుకు 2GB డేటాతో లాంగ్ వ్యాలిడిటీని అందిస్తుంది
- డేటా కోసం Vi బెస్ట్, లాంగ్ టైమ్ కోసం BSNL బెటర్
- రూ. 435 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ
Vi vs BSNL Plans : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు వోడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ యూజర్ అయినా మీకోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. సరసమైన ప్లాన్లను ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు.
మీరు కూడా డేటా, కాల్ వ్యాలిడిటీతో పాటు అదనపు బెనిఫిట్స్ అందించే మంచి ప్లాన్ల కోసం (Vi vs BSNL Plans) చూస్తున్నారా? మీకోసం Vi నుంచి రూ. 435 ప్రీపెయిడ్ ప్లాన్ రెడీగా ఉంది. అలాగే, BSNL నుంచి రూ. 485 ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు.
ఈ రెండు ప్యాకేజీలలోని కాలింగ్ టెక్స్టింగ్ బెనిఫిట్స్ చాలా వరకు ఒకేలా ఉంటాయి. కానీ, ఇతర బెనిఫిట్స్ డిఫరెంట్.. వోడాఫోన్ ఐడియా నుంచి రూ. 435, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 485 ప్రీపెయిడ్ ప్యాకేజీలలో మీకు నచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోండి.. డేటా బెనిఫిట్స్, వ్యాలిడిటీ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Vi రూ. 435 ప్రీపెయిడ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా రూ. 435 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అయితే, ఈ అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ అనేది పర్సనల్, కమర్షియల్ వినియోగం మాత్రమేనని కంపెనీ స్పష్టంగా పేర్కొంది.
అంతేకాదు.. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీతో స్పాటిఫై ప్రీమియం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. 5జీ సపోర్టు కోసం ఈ ప్లాన్ 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాలలో అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్ 72 రోజుల ఫుల్ వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 2GB డేటాతో పాటు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
అయితే, రోజువారీ 2GB లిమిట్ దాటాక కూడా డేటాను వాడొచ్చు. కానీ, ఆ డేటా స్పీడ్ 40Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌కు రోజుకు సుమారు రూ. 6.7 చెల్లించాలి. వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ కన్నా చాలా చౌకైనది.
ఎందులో బెనిఫిట్ ఎక్కువంటే? :
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో సింగిల్ కాలింగ్ SMS బెనిఫిట్స్ ఒకేలా ఉన్నా వ్యాలిడిటీ, డేటా బెనిఫిట్స్ కూడా అదనంగా పొందవచ్చు. అయితే, అన్‌లిమిటెడ్ డేటాతో పాటు కొన్ని ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీలను కూడా పొందవచ్చు. ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసం వోడాఫోన్ ఐడియా రూ. 435 ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోండి. కానీ, మీకు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే BSNL రూ. 485 ప్లాన్ తీసుకోవడం బెటర్.
