Realme P4s Launch : పండగ చేస్కోండి.. కొత్త రియల్‌మి P4s ఫోన్ వచ్చేసింది.. AI ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..!
Realme P4s Launch : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌తో కొత్త రియల్‌మి P4s భారత మార్కెట్లో లాంచ్ అయింది. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Realme P4s Launch
- రియల్‌మి P4s ఫోన్ భారీ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- స్మూత్ అమోల్డ్ డిస్ప్లే 50MP మెయిన్ కెమెరా సెటప్
- ఈ ఫోన్ ధర రూ. 34,999 నుంచి ప్రారంభం
- సెప్టెంబర్ 3 నుంచి ఈ సేల్ అందుబాటులోకి
Realme P4s Launch : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. రియల్‌మి P4s భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ P సిరీస్ లైనప్ కంపెనీ విస్తరించింది. ఇప్పటికే మార్కెట్లో స్టాండర్డ్ రియల్‌మి పీ4 5జీ, రియల్‌మి పీ4 ప్రో 5జీ, రియల్‌మి పీ4 పవర్ 5జీ, రియల్‌మి P4 లైట్, రియల్‌మి P4x 5జీ ఉండగా లేటెస్టుగా రియల్‌మి P4s కూడా లైనప్‌లో చేరింది.
ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8,000mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP AI ప్రైమరీ కెమెరా (Realme P4s Launch) కూడా ఉంది. వినియోగదారులు ఈ డివైజ్‌లను రిటైల్ స్టోర్లలో కొనేసుకోవచ్చు. ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి P4s ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రియల్‌మి P4s స్పెసిఫికేషన్లు :
144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K శాంసంగ్ అమోల్డ్ డిస్ప్లే అందిస్తుంది. 1400 నిట్స్ టాప్ బ్రైట్నెస్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. ఈ డిస్ప్లే HDR10+కు కూడా సపోర్టు ఇస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ఫోన్ ప్రొటెక్షన్ కోసం IP66, IP68, IP69 సర్టిఫికేషన్లతో వస్తుంది.
Read Also : Xiaomi 17 Ultra Price : ఇది కదా డిస్కౌంట్.. షావోమీ 17 అల్ట్రాపై ఏకంగా రూ. 10వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm టెక్నాలజీతో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్సెట్ అమర్చారు. ఇందులో 12GB వరకు ర్యామ్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ 8,000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. :
ఈ రియల్‌మి ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ రియల్‌మి యూఐ 7.0తో వస్తుంది. కంపెనీ 3 ఏళ్ల OS అప్గ్రేడ్లు, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో అందిస్తోంది.
రియల్‌మి P4s ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 37,999 కాగా, టాప్-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999గా ఉంది.
ఈ ఫోన్ కొనుగోలుపై రియల్‌మి రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 3 నుంచి అమ్మకానికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అధికారిక రియల్‌మి వెబ్సైట్, మెయిన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనేసుకోవచ్చు.
