Vivo-iQOO Prices
Vivo-iQOO Prices : వివో, ఐక్యూ అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో ఈ రెండు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రత్యేకించి వివో, ఐక్యూతో సహా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉంది. వివో T4 సిరీస్, ఐక్యూ Z10 లైనప్‌లోని మల్టీ మోడళ్ల ధర వేరియంట్‌ను బట్టి రూ. 1,500 నుంచి రూ. 2,500 వరకు పెరుగుతుందని టిప్‌స్టర్ పేర్కొంది.
అయితే, ఈ ఫోన్ల ధరలపై బ్రాండ్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, కొత్త ధరలు మాత్రం వచ్చే నెలలో అమలులోకి రావచ్చు. నివేదికల ప్రకారం.. పెరుగుతున్న మెమరీ, కాంపోనెంట్ ఖర్చుల వల్ల ఫోన్ల ధర పెరగనున్నాయి. ఏయే ఫోన్లపై ఎంతవరకు ధరలు పెరగనున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఏ ఫోన్లు ఖరీదైనవి :
టిప్‌స్టర్ల ప్రకారం.. వివో T4x ఫోన్ ధర ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది. 6GB + 128GB ధర రూ.15,4999 నుంచి రూ.16,999కి పెరగవచ్చు. 8GB వేరియంట్ ధర రూ.128GB, 256GB వేరియంట్‌లకు వరుసగా రూ.18,999, రూ.20,999కి పెరిగే అవకాశం ఉంది.
🚨 Vivo & iQOO PRICE HIKE (Effective 1st March)
Here are the EXACT old vs new prices 📊
📱 vivo T4x
• 6+128GB: ₹15,499 → ₹16,999 (+₹1,500)
• 8+128GB: ₹16,499 → ₹18,999 (+₹2,500)
• 8+256GB: ₹18,499 → ₹20,999 (+₹2,500)📱 vivo T4R
• 8+128GB: ₹20,999 → ₹22,999… pic.twitter.com/go9juug6M1— Abhishek Yadav (@yabhishekhd) February 27, 2026
వివో T4R, వివో T4 ఫోన్లపై కూడా రూ.2,000 వరకు పెరిగే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ రెండు ఫోన్లలో బేస్ 8GB + 128GB వేరియంట్‌ల ధర వరుసగా రూ.22,999, రూ.24,999 కాగా, హై స్టోరేజీ 12GB వేరియంట్‌ల ధర రూ.27వేల నుంచి రూ.29వేల మార్కుకు దగ్గరగా ఉంటుంది.
ఐక్యూ ఫోన్ల విషయానికి వస్తే.. ఐక్యూ Z10x ధర కూడా రూ.2,500 పెరగవచ్చు. ఐక్యూ Z10R, ఐక్యూ Z10 కూడా అన్ని లిస్టెడ్ కాన్ఫిగరేషన్లలో రూ.2వేలు పెరగవచ్చునని చెబుతున్నారు.
ఇది అమల్లోకి వస్తే.. మార్చి 1 ప్రారంభంలో కొత్త ధర అమల్లోకి వస్తుంది. పైన పేర్కొన్న మోడళ్లతో పాత ఫోన్లను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.