Vivo S2 Launch Date : వివో లవర్స్ రెడీనా? కొత్త వివో S2 ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే!
Vivo S2 Launch Date : భారత మార్కెట్లో వివో ఎస్2 ఫోన్ లాంచ్ కాబోతుంది. వచ్చే ఆగస్టులో ఈ కొత్త వివో ఫోన్ రాబోతుంది. ముందుగానే ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి..
- Sreehari A
- Published on- July 24, 2026 / 12:09 PM IST
Vivo S2 Launch Date
- ఆగస్టు 6న వివో S2 ఫోన్ లాంచ్
- 2 స్టోరేజ్ వేరియంట్లు, 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని అంచనా
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, 120Hz OLED డిస్‌ప్లే
- 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ ఉండొచ్చు
Vivo S2 Launch Date : కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, కొద్ది రోజులు ఆగండి.. వివో కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. సరిగ్గా ఏడేళ్ల తర్వాత వివో S సిరీస్‌ను మళ్లీ లాంచ్ చేయబోతుంది. రాబోయే వివో S2 ఫోన్ వివరాలను కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు.
లీకులు, పుకార్ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. వివో S సిరీస్ ఫోన్ 2 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు 3 కలర్ వేరియంట్‌లలో వస్తుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC ప్రాసెసర్‌తో పాటు బ్యాక్ ప్యానెల్‌పై ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుందని భావిస్తున్నారు. వివో S2 ఫోన్ సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధరలు (అంచనా) :
8GB + 128GB: రూ. 43,000 (అంచనా)
8GB + 256GB: రూ. 42,000 (అంచనా)
8GB + 128GB డెమో : రూ. 38,000
8GB + 256GB డెమో : రూ. 42,000
కేవలం లాంచ్ సమయంలో మాత్రమే ధరల వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే, బ్యాంక్ కార్డు ఆఫర్లను బట్టి ప్రారంభ ధర మారవచ్చు.
లాంచ్ తేదీ (అంచనా) :
స్మార్ట్‌ఫోన్ లాంచ్ విషయంలో కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6న లాంచ్ కానుంది. ఈ వివో ఫోన్ ఆగస్టు 11 నుంచి అమ్మకానికి రానుంది.
కలర్ ఆప్షన్లు :
ధరతో పాటు యూజర్లకు సప్పైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్, సిల్క్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయని కూడా వెల్లడైంది.
Read Also : Google Pixel 9a : వారెవ్వా.. ఈ పిక్సెల్ ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
వివో S2 స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. రాబోయే వివో S2 ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా వస్తుందని అంచనా.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..
ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు 8జీబీ ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత స్కిన్ కలర్‌ఓఎస్ 16తో రావచ్చు.
వివో ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీతో లాంచ్ చేస్తుందని అంచనా. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వైర్‌లెస్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఉండొచ్చు.
కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని అంచనా. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉండొచ్చు.
