×
Ad

Vivo S50 Series : వివో లవర్స్ మీకోసమే.. ఈ నెల 15న వివో S50 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు మాత్రం హైరేంజ్ అంతే..!

Vivo S50 Series : వివో S50, వివో S50 ప్రో మినీ డిసెంబర్ 15న లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముందే ర్యామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లు 16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి.

Vivo S50 Series

Vivo S50 Series : కొత్త వివో స్మార్ట్‌ఫోన్ సిరీస్ రాబోతుంది. డిసెంబర్ 15న వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. వివో S50, వివో S50 ప్రో మినీ పేరుతో ముందుగా చైనా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
ఈ వివో ఫోన్లు ఇప్పటికే అనేక మెయిన్ చైనీస్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. రాబోయే ఫోన్‌ల (Vivo S50 Series) కాన్ఫిగరేషన్‌లు, కలర్ ఆప్షన్లు, హార్డ్‌వేర్ వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

ర్యామ్, స్టోరేజీ, కలర్ వేరియంట్లు :
నివేదికల ప్రకారం.. వివో S50 సిరీస్ మొత్తం 4 వేరియంట్లలో (12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB) వస్తుంది. ఈ ఫోన్ స్పేస్ బ్లాక్, కన్ఫెషన్ వైట్, సైరెన్ బ్లూ ఇన్స్పిరేషనల్ పర్పుల్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో S50 ప్రో మినీ విషయానికొస్తే.. 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB అనే 3 వేరియంట్లలో వస్తుంది. అలాగే, స్పేస్ బ్లాక్, కన్ఫెషన్ వైట్ ఇన్స్పిరేషనల్ పర్పుల్ కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది.

వివో S50 సిరీస్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
లీక్‌ల ప్రకారం.. వివో S50 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. ఈ వివో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు. 6500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉండవచ్చు.

Read Also : Upcoming Electric SUVs 2026 : టాటా సియెర్రా EV టు కియా సిరోస్ EV.. 2026లో మార్కెట్ షేక్ చేయనున్న టాప్ 5 పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు!

వివో S50 ప్రో మినీ లీకుల ప్రకారం.. ఇందులో 6.31-అంగుళాల 1.5K డిస్‌ప్లే ఉంటుందని అంచనా. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. వివో ఫోన్ బ్యాటరీ 6500mAhతో పాటు 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వివో ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ రెండు వివో ఫోన్లలో LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. సెల్ఫీ కెమెరా 50MP కావచ్చు. కంపెనీ బ్యాక్ సైడ్ 50MP పెరిస్కోప్ కెమెరా కూడా ఉండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. వివో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఆరిజిన్ OS6పై రన్ అవుతుంది.

కంపెనీ ఈ వివో ఫోన్‌ను ఏరోస్పేస్-గ్రేడ్ మెటల్ ఫ్రేమ్‌తో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బయోమెట్రిక్ సేఫ్టీ కోసం డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/69 రేటింగ్ చేయవచ్చు. ధరల విషయానికి వస్తే.. వివో S50, వివో S50 ప్రో మినీ ధరలు వరుసగా రూ. 41,990, రూ. 39,990 లభ్యం కానున్నాయి.