Vivo S50T 5G : వివోనా మజాకా.. ఈ వివో 5G ఫోన్ రేంజే వేరబ్బా.. ఇలాంటి ఫోన్ లైఫ్‌లో ఒక్కసారైనా కొనాల్సిందే..!
Vivo S50T 5G : వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తామంటారు..
- Sreehari A
- Published on- May 3, 2026 / 04:35 PM IST
Vivo S50T 5G : వివో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో S50t 5G మార్కెట్లోకి సైలెంట్ గా రిలీజ్ అయింది. ఈ ఫోన్‌లో అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పాటు ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది.
ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 6500mAh బ్యాటరీ ఉంది. వివో S50t 5జీ అనేది కంపెనీ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ అయినా గత ఏడాది లాంచ్ అయిన వివో S50 మాదిరి పోలి ఉంటుంది. ముఖ్య ఫీచర్లు, ధరను ఓసారి పరిశీలిద్దాం..
వివో S50t 5జీ ధర ఎంతంటే? : వివో S50T 5జీ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB + 512GB స్టోరేజ్ మోడల్ ధర 3,299 యువాన్లు (సుమారుగా రూ. 48,500) కాగా, 16GB + 512GB స్టోరేజ్ మోడల్ ధర 3,599 యువాన్లు (సుమారుగా రూ. 50వేలు)గా ఉంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
వివో S50t 5జీ స్పెసిఫికేషన్లు : వివో S50t 5జీ ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ HDR సపోర్ట్‌ను కూడా అందించింది. ఈ ఫోన్ P3 కలర్ గామట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ లో బ్లూ లైట్ టెక్నాలజీతో సహా కంటికి సరిపడే కొన్ని ఫీచర్లను కూడా డిస్‌ప్లేలో అందిస్తుంది. హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వివో S50t 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఒరిజిన్OS 6 స్కిన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌లోని థర్డ్ కెమెరా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాకు సోనీ IMX882 సెన్సార్‌ను అందించారు. సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ ఫోన్ రెండు కెమెరాలతో పాటు ఫ్లాష్ కూడా అందించింది. ఇతర ఫీచర్లలో సేఫ్టీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi 6, NFC, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంది. అలాగే ఈ వివో ఫోన్‌లో ఐఆర్ బ్లాస్టర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
