×
Ad

Vivo T4 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌‌.. వివో T4 అల్ట్రా 5జీ ఆఫర్ అదుర్స్.. జస్ట్ రూ. 34,999కే.. ఎలా కొనాలంటే?

Vivo T4 Ultra 5G : వివో అభిమానుల కోసం అద్భుతమైన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో వివో T4 అల్ట్రా 5జీ ఫోన్‌ కేవలం రూ. 34,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T4 Ultra 5G

  • ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో భారీగా తగ్గిన వివో T4 అల్ట్రా 5జీ ఫోన్‌
  • 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5500mAh బ్యాటరీ ప్యాక్‌
  • 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, 12GB ర్యామ్ వరకు 512GB వరకు స్టోరేజీ

Vivo T4 Ultra 5G : వివో కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో వివో T4 అల్ట్రా 5జీ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 2025లో లాంచ్ అయిన వివో T4 అల్ట్రా ఫోన్
ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది.

90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5500mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 12GB ర్యామ్ వరకు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. వివో T4 అల్ట్రా 5జీ ఫోన్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో భారీ తగ్గింపు, డిస్కౌంట్ ద్వారా కేవలం రూ. 34,999 నుంచి లభ్యమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ డిస్కౌంట్, ఆఫర్లు :
వివో T4 అల్ట్రా 5జీ ఫోన్ ఫస్ట్ భారత మార్కెట్లో రూ. 40,999 ధరకు లాంచ్ అయింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో భారీ తగ్గింపుతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 35,999కే అందుబాటులో ఉంది. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2,747 క్యాష్‌బ్యాక్ ఆప్షన్‌ అందిస్తుంది.

మీకు HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే.. రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. మీరు ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించకపోతే.. మీరు నెలకు రూ. 5,823 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐలో కూడా ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ మొత్తాన్ని 6 నెలల పాటు చెల్లించాలి.

Read Also : Flipkart Valentines Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 16 జస్ట్ రూ. 56,999కే.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
వివో T4 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ ఆటో ఫోకస్‌తో 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ భారీ 5500mAh బ్యాటరీ కెపాసిటిని అందిస్తుంది. 90W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్
వివో T4 అల్ట్రా 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. 5000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ అందిస్తుంది. ఈ ఫోన్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, అల్యూమినియం ఫ్రేమ్‌ కూడా అందిస్తుంది. 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్, USB టైప్-C పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది.

పర్ఫార్మెన్స్ :
వివో T4 అల్ట్రా 5జీ ఫోన్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB, 12GB ర్యామ్, 256GB లేదా 512GB యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది. సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఎరేస్, ఏఐ నోట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లతో వస్తుంది.