Flipkart Valentines Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 16 జస్ట్ రూ. 56,999కే.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..
Flipkart Valentines Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలంటే?
Flipkart Valentines Sale
- ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ ప్రారంభం
- ఆపిల్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్
- ఐఫోన్ 16 చౌకైన ధరకే ఎలా పొందాలంటే?
Flipkart Valentines Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది. 2024లో లాంచ్ అయిన ఈ ఐఫోన్ మోడల్ వాలెంటైన్స్ సేల్‌లో కేవలం రూ. 56,999కే లభిస్తోంది.
పవర్ఫుల్ A18 చిప్సెట్తో వస్తుంది. 48MP డ్యూయల్ కెమెరా సెటప్ పొందుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 3561mAh బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఐఫోన్ 16 చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర, డిస్కౌంట్, ఆఫర్లు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 మోడల్ రూ. 69,900కు లిస్ట్ అయింది. 14శాతం తగ్గింపుతో ధర రూ. 59,999కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్ సమయంలో రూ. 56,999కు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ. 4,897 తగ్గింపు పొందవచ్చు. మీరు ఒకేసారి పేమెంట్ చేసి పూర్తి మొత్తం లేకపోతే నెలవారీ ఈఎంఐ కోసం కేవలం రూ. 2,848 చెల్లించి ఫోన్ కొనేసుకోవచ్చు.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
ఆపిల్ ఐఫోన్ 16 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్/1.6 అపెర్చర్‌తో 48MP ఫ్యూజన్ మెయిన్ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.
అయితే, ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్, ఎఫ్/1.9 అపెర్చర్‌తో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ 3561mAh బ్యాటరీ ప్యాక్ కూడా అందిస్తుంది. సాధారణ వినియోగంలో ఒక రోజు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఐఫోన్ MagSafe, USB టైప్-C పోర్ట్ ద్వారా వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
డిస్ప్లే, డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కాంపాక్ట్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఎన్క్లోజర్తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కూడా ఉంది. 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.
పర్ఫార్మెన్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ ఆపిల్ A18 చిప్ ద్వారా హెక్సా-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ కోసం లేటెస్ట్ iOS26పై రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ పొందవచ్చు. రోజువారీ వినియోగం, గేమింగ్ పరంగా బెస్ట్ ఆప్షన్. విజయ్ సేల్స్ వంటి స్టోర్లలో కూడా కొనేసుకోవచ్చు.
