Vivo T5 5G Discount : వివో T5 5G కొనేవారికి పండగే.. రూ.49,999 ఫోన్ జస్ట్ రూ.29 వేలకే.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..!
Vivo T5 5G Discount : భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వివో T5 5జీ లేటెస్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- November 8, 2026 / 07:05 PM IST
Vivo T5 5G Discount
- వివో టీ5 5జీపై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.20,550 వరకు తగ్గింపు
- ఫ్లిప్‌కార్ట్‌లో వివో T5 5జీ ధర భారీగా డౌన్.. బ్యాంక్ కార్డుతో మరింత చౌక
- 7050mAh బ్యాటరీ, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే అదుర్స్
Vivo T5 5G Discount : వివో ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త వివో ఫోన్ కొనాలని చూస్తున్నారా? భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే, గేమింగ్‌కు సరిపోయే ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే వివో నుంచి ఒక మంచి డీల్ అందుబాటులో ఉంది. వివో T5 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.. బ్యాంక్ ఆఫర్‌తో ఈ వివో ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వివో టీ5 5జీ ధర ఎంతంటే? :
వివో టీ5 5జీ ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.49,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34,999కే అందుబాటులో ఉంది. ఇక ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5,550 వరకు తగ్గింపు లభిస్తుంది. తద్వారా ధర రూ.29,449కు తగ్గుతుంది. అయితే, క్యాష్‌బ్యాక్ నిబంధనలు, క్రెడిట్ టైమ్ కూడా ఓసారి చెక్ చేసుకోవాలి..
ఇతర వేరియంట్ల విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ రూ.39,999కు, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.49,999కు లభిస్తున్నాయి. వీటితో పాటు రూ.199 ప్రొటెక్ట్ ప్రామీస్ ఫీజు కూడా వర్తించవచ్చు..
వివో 5జీ ఫోన్ ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.. మీడియాటెక్ డైమన్షిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది..
కెమెరా విషయానికి వస్తే..
OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక ఈ ఫోన్‌లోని 7,050mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. IP68, IP69 రేటింగ్స్ కూడా అందిస్తుంది..
భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఛార్జీలేంటో చెక్ చేసుకోండి..
