×
Ad

Vivo V50 5G : వావ్.. వండర్‌ఫుల్.. ఈ వివో 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 9వేలు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo V50 5G : వివో V50 5జీ ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి50 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/6
Vivo V50 5G : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో వి50 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 39,999 ధరకు లాంచ్ అయిన వివో ఫోన్ బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. వివో V50 5జీ ఫీచర్ల విషయానికి వస్తే.. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కలర్‌ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, జీఇఐఎస్ఎస్ సపోర్టుతో అదిరిపోయే కెమెరాలతో వస్తుంది.
2/6
మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే.. ఈ డీల్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 5జీ ఫోన్ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 5జీ డీల్ : ఈ వివో ఫోన్ మొదట్లో భారత మార్కెట్లో రూ.39,999 ధరతో లాంచ్ అయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.9వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.30,999కి తగ్గుతుంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.26,999కి తగ్గుతుంది.
4/6
మీరు కొత్త ఫోన్ కోసం చూస్తుంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రూ.25,550 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర మీ పాత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఉంటుంది. వివో V50 5జీ ఫోన్ కోసం ఒకేసారి పేమెంట్ చేయలేకపోతే ఈ-కామర్స్ దిగ్గజం నెలకు కేవలం రూ.1,090 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
5/6
వివో V50 5జీ స్పెసిఫికేషన్లు : వివో V50 హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, 12GB LPDDR4X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. ఈ వివో ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేటుతో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సూర్యకాంతిలో కూడా ఫోన్ డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ వివో ఫోన్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
6/6
ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో V50 డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. జీఈఐఎస్ఎస్ సపోర్టుతో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.