Vivo V70 FE Sale : 200MP కెమెరాతో వివో V70 FE ఫస్ట్ సేల్.. ఇలా కొన్నారంటే భారీ తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు!
Vivo V70 FE Sale : కొత్త వివో ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? గత వారమే లాంచ్ అయిన వివో వి70 ఎఫ్ఈ ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : April 9, 2026 / 08:44 PM IST
Vivo V70 FE Sale
- వివో V70 ఎఫ్ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్
- 200MP ప్రైమరీ కెమెరా, మరిన్ని ఫీచర్లు, భారీ బ్యాంకు ఆఫర్లు
- 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, కనెక్టివిటీ ఆప్షన్లు
Vivo V70 FE Sale : వివో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఇటీవలే లాంచ్ అయిన వివో వి70 ఎఫ్ఈ ఫోన్ భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. బ్యాంకు ఆఫర్లతో భారీగా ఆదా చేసుకోవచ్చు.
7000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ రోజే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ను అమర్చారు. వివో వి70 ఎఫ్ఈ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను వివరంగా పరిశీలిద్దాం..
వివో వి70 ఎఫ్ఈ ధర ఎంతంటే? :
వివో V70 ఎఫ్ఈ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 , 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999కు కొనేసుకోవచ్చు.
వివో వి70 ఎఫ్ఈ సేల్ ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ , వివో ఇండియా ఇ-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసిన కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం తగ్గింపు బ్యాంక్ ఆఫర్ అందిస్తోంది.
వివో V70 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
వివో V70 ఎఫ్ఈ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2800×1260 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, టాప్ బ్రైట్‌నెస్ 1900 నిట్స్ వరకు ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. 7000mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. వివో వి70 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ ఎఫ్/1.88 అపర్చర్, OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఐ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, USB టైప్-సీ 2.0 పోర్ట్, NFC ఉన్నాయి.
