Vivo V80 5G Sale : సూపర్ డిస్కౌంట్ బ్రో.. వివో V80 5G అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంతకన్నా తక్కువకు దొరకదు..!
Vivo V80 5G Sale : వివో ఫోన్ అదుర్స్.. వివో వి80 5జీపై ఏకంగా 44 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ సేల్ సందర్భంగా ఈ సేల్ ఆఫర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 16, 2026 / 12:49 PM IST
Vivo V80 5G Sale
- వివో వి80 5జీ సేల్ ఆఫర్ అదిరింది
- అతి చౌకైన ధరకే వివో కొత్త ఫోన్ మీ సొంతం
- ఫ్లాట్ డిస్కౌంట్ 44 శాతం తగ్గింపు
Vivo V80 5G Sale : వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు వివో కస్టమర్ అయితే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్లు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
అనేక ఫోన్ మోడల్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్, స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ (Vivo V80 5G Sale) కేటగిరీలలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వివో వి80 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫ్లాట్ 44శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ అదిరే ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో వి80ఎక్స్ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ కాగా సన్‌రైజ్ ఆంథెమ్, హొరైజన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియా వెబ్సైట్లో రూ. 62,999 ధరకు లిస్టు అయింది. అమెజాన్ ప్రకారం అసలు ధర రూ. 111,999 ఉండగా ఇప్పుడు 44శాతం తగ్గింపుతో వస్తుంది.
వివో V80ఎక్స్ ఫోల్డ్6 ఆఫర్లు :
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 5,050 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 6,300 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 6,300 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ వివో ఫోన్‌పై రూ. 43,700 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. మీ పాత ఫోన్ వాల్యూ, బ్రాండ్, మోడల్, ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది.
వివో V80 స్పెసిఫికేషన్లు :
వివో వి80లో 144 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్OS 7పై రన్ అవుతుంది.
వివో V80లో భారీ 7,200mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా (OIS జైస్ ఆప్టిక్స్‌తో), 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
