Vivo V80 5G Sale : 50MP ట్రిపుల్ కెమెరా అదుర్స్.. వివో V80 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇంత తక్కువకా..!

Vivo V80 5G Sale : వివో ఆఫర్ అదిరింది భయ్యా.. 50MP ట్రిపుల్ కెమెరా ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్‌లో రూ. 6,300 తక్కువకే కొనేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

Vivo V80 5G Sale

  • వివో వి80లో 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే 
  • భారీ 7200mAh బ్యాటరీ సెటప్, 50MP ప్రైమరీ కెమెరా
  • ఈ ఫోన్‌లో అల్ట్రా సినిమాటిక్ వీడియో ఫీచర్ అదుర్స్

Vivo V80 5G Sale : వివో లవర్స్ కోసం అద్భుతమైన డీల్.. అమెజాన్ సేల్‌లో వివో V80 5G ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్‌పై సుమారు 44శాతం తగ్గింపు అందిస్తోంది. అసలు ధర కన్నా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

వివో V80 5జీ లాంచ్ తర్వాత ఇదే భారీ తగ్గింపు అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 7200mAh భారీ బ్యాటరీ, అల్ట్రా సినిమాటిక్ వీడియో ఫీచర్ ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫోన్‌ ఇప్పుడు భారీ తగ్గింపుతో ఎలా కొనుగోలు చేయాలో వివరంగా తెలుసుకుందాం..

వివో వి80 5జీ తగ్గింపు ధర ఆఫర్ :
వివో వి80 5జీని భారీ తగ్గింపుతో కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,11,999 ఉండగా, అమెజాన్‌లో 44శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఆ తర్వాత, ఈ ఫోన్‌లోని 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 62,999 అవుతుంది.

Read Also : Xiaomi 4K TV : అమెజాన్‌లో బిగ్ డీల్.. 43 అంగుళాల షావోమీ రూ.50వేల 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.28,999కే..

అయితే, ఇంకా తక్కువ ధరకు కొనాలంటే ఇదే అద్భుతమైన ఆఫర్.. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా వివో వి80 5జిని ఇంకా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. అదనంగా రూ. 6300 ఆదా చేసుకోవచ్చు.

వివో వి80 5జి స్పెసిఫికేషన్లు :
వివో వి80లో 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 90W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 7,200mAh బ్యాటరీ ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. వివో వి80 ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఒరిజిన్OS 7పై రన్ అవుతుంది.

వివో వి80 బ్యాక్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.88 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.65 అపర్చర్‌తో 50MP టెలిఫోటో కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, డ్యూయల్-సిమ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.