Vivo V80 Lite 5G : వివో క్రేజే వేరబ్బా.. 10000mAh బ్యాటరీతో V80 లైట్ 5G వస్తోంది.. ప్రీ-ఆర్డర్లు షురూ.. ధర మాత్రం సస్పెన్స్!

Vivo V80 Lite : వివో కొత్త ఫోన్ వస్తోందోచ్.. సెప్టెంబర్ 3న మలేసియా మార్కెట్లో వివో వి80 లైట్ 5జీ ఫోన్ లాంచ్ కాబోతుంది. 50ఎంపి సోనీ కెమెరా, 10000mAh బ్యాటరీపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

Vivo V80 Lite

  • వివో V80 లైట్ 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ
  • 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ కూడా ఉండనుంది
  • సెల్ఫీల కోసం 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా

Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ మలేషియా మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇటీవలే ఈ ఫోన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది.

వివో V80 లైట్ 5G మలేషియాలో లాంచ్ కాకముందే ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 10000mAh బ్యాటరీ (Vivo V80 Lite 5G) స్పెషల్ అట్రాక్షన్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో V80 లైట్ 5G లాంచ్ ముందు ఈ ఫోన్ ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

లాంచ్ తేదీ, ధర (అంచనా) :
ఈ వివో V80 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 3న మలేషియా మార్కెట్లోకి లాంచ్ కానుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ ఫీచర్లపై తెగ చర్చ నడుస్తోంది. ప్రీ-ఆర్డర్లు ముందే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఫోన్‌ను 3 మెయిన్ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేయనుంది.

Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..!

అందులో 6GB+128GB, 6GB+256GB, 8GB+256GB వేరియంట్లు ఉన్నాయి. అలాగే, పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. ఈ ఫోన్ ధర RM9,999.00గా కంపెనీ నిర్ణయించినట్టు అంచనా.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ వివో V80 లైట్ 5జీలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ మోడల్ నంబర్‌తో పాటు, డైమెన్సిటీ చిప్‌సెట్ కూడా కనిపించింది. 1.5K హై-బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఉంది. డైమెన్సిటీ 7300e చిప్‌తో ఓఎల్‌ఇడీ ప్యానెల్‌ కూడా ఉంటుందని అంచనా. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. బ్లూ లైట్ కోసం టీయువీ (TUV) సర్టిఫికేషన్‌తో కూడా కనిపించింది.

వివో V80 లైట్ 5G ఫోన్ 10,000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP సోనీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం కంపెనీ 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.